'విశ్వంభర' టీజర్‌లో గ్రాఫిక్స్‌పై ట్రోల్స్ | Trolls On Vishwambhara Teaser VFX | Sakshi
Sakshi News home page

Viswambhara Teaser: టీజర్‌లోనే కాపీ షాట్.. తప్పని విమర్శలు!

Oct 12 2024 4:21 PM | Updated on Oct 12 2024 4:39 PM

Trolls On Vishwambhara Teaser VFX

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్ రిలీజైంది. ముందు నుంచే చెబుతున్నట్లు ఇది సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీతో తీస్తున్న సినిమా.. అందుకు తగ్గట్లే టీజర్‌లో గ్రాఫిక్స్ ఉన్నాయి. మెగా ఫ్యాన్స్‌కి చిరు గ్రేస్‌తో పాటు అన్నీతెగ నచ్చేస్తుంటే.. మిగిలిన వాళ్లలో కొందరు మాత్రం గ్రాఫిక్స్ షాట్స్ విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్)

అలానే టీజర్‌ ప్రారంభంలో చూపించే అంతరిక్షం సీన్.. హాలీవుడ్ హిట్ సినిమా 'అవెంజర్స్' నుంచి తెచ్చి పెట్టారని ప్రూఫ్స్‌తో ట్వీట్స్ పెడుతున్నారు. మరికొందరైతే గ్రాఫిక్స్ నేచురల్‌గా లేవని అంటున్నారు. మూవీ రిలీజ్ టైంకి ఇవన్నీ కాస్త కరెక్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చిరంజీవిని ఏం అనట్లేదు గానీ గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు వశిష్ఠ కేర్ తీసుకోలేదని విమర్శిస్తున్నారు. ఇతడిని 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్‌తో పోల్చి ట్రోల్ చేస్తున్నారు.

చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాని లెక్క ప్రకారం సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయాలి. కానీ 'గేమ్ ఛేంజర్' కోసం దీన్ని వాయిదా వేశారు. ఈ విషయాల్ని అధికారికంగా ప్రకటించారు. అంటే 'విశ్వంభర' వచ్చేది వేసవికే అనమాట. ఏప్రిల్‌లో 'రాజా సాబ్' ఉంది కాబట్టి మేలోనే రిలీజయ్యే ఛాన్సులు ఎక్కువ. మరి చూడాలి ఏ డేట్ ఫిక్స్ చేస్తారో?

(ఇదీ చదవండి: పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement