
ఆది పినిశెట్టి
మైదానంలోకి దిగి ఆట ఆడటానికి ఫుల్‌గా ప్రిపేర్ అయ్యారు ఆది పినిశెట్టి. ప్రిత్వి ఆదిత్య దర్శకత్వంలో ఆది హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనుంది. బిగ్ ప్రింట్ పిక్చర్స్ పతాకంపై ఐబీ కార్తికేయన్ నిర్మించ నున్నారు. పీఎంఎం ఫిల్మ్స్, జి. మనోజ్, జి. శ్రీహర్ష సహ నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ‘‘ఓ యువకుడు అథ్లెట్‌గా మారే క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు. వాటిని అధికమించి ఎలా ఉన్నతస్థాయికి చేరుకున్నాడన్నదే కథాంశం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం’’ అని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సినిమాకు కెమెరా: ప్రవీణ్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment