మరో విభిన్న పాత్రలో.. ఆది పినిశెట్టి | Aadhi Pinisetty Signs A New Movie As Sports Drama | Sakshi
Sakshi News home page

మరో విభిన్న పాత్రలో.. ఆది పినిశెట్టి

Jun 2 2019 7:25 PM | Updated on Jun 2 2019 7:25 PM

Aadhi Pinisetty Signs A New Movie As Sports Drama - Sakshi

వైవిధ్య‌మైన క‌థ‌లు, పాత్ర‌ల‌తో మెప్పిస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ న‌టుడు ఆది పినిశెట్టి. ఈయ‌న త‌ర్వ‌లోనే ఓ స్పోర్ట్స్ డ్రామాలో న‌టించ‌బోతున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్  జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ప్రిత్వి ఆదిత్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. స్పోర్ట్స్ జోన‌ర్ చిత్రంలో ఆది పినిశెట్టి న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాషల్లో ఏక‌కాలంలో రూపొందించ‌నున్నారు. ఆది పినిశెట్టితో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉందని దర్శకుడు ప్రిత్వి ఆదిత్య అన్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను  తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

ఓ యువ‌కుడు అథ్లెట్‌గా మారే క్ర‌మంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడు. వాటిని ఎలా అధిగ‌మించి ఉన్న‌త‌స్థాయికి చేరుకున్నాడ‌నేదే ప్ర‌ధాన క‌థాంశం. ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయ‌న్ నిర్మిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ సంస్థ రూపొందిస్తోంది. పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌వీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement