అనుష్కతో జత కట్టనున్న విలన్ | Aadhi Pinisetty to pair up with Anushka in Bhagmati | Sakshi
Sakshi News home page

అనుష్కతో జత కట్టనున్న విలన్

Published Sun, Jun 5 2016 5:16 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

అనుష్కతో జత కట్టనున్న విలన్

అనుష్కతో జత కట్టనున్న విలన్

వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తమిళ బాట పట్టిన ఈ యంగ్ హీరో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అడపాదడపా తెలుగు సినిమాలు చేస్తున్న స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయాడు. అయితే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమాతో విలన్గా ఎంట్రీ ఇచ్చిన ఆది మంచి మార్కులు సాధించాడు.

దీంతో ప్రస్తుతం టాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు ఆది మీద పడింది. డిఫరెంట్ జానర్లో తెరకెక్కే సినిమాల కోసం ఆదిని హీరోగా తీసుకోవాలని భావిస్తున్నారు. అదే బాటలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న లేడి ఓరియంటెడ్ సినిమా భాగమతిలో అనుష్కకు జంటగా ఆదిని ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడు అశోక్ చెప్పిన కథ విన్న ఆది వెంటనే ఒప్పేసుకున్నాడట.

ఇప్పటికే మళయాల నటుడు జయరాంను విలన్ పాత్రకు ఎంపిక చేయగా, మరో కీలక పాత్ర కోసం టబుతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇలా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల నటులతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల మూడో వారంలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అప్పుడే సినిమాలో నటించే నటీనటుల విషయంలో మరింత క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement