పాత్రలు ప్రతిసారీ ఛాలెంజ్‌లు విసరవు.. క్యారెక్టర్ ప్రతిసారీ కొత్తగా ఉండదు. కానీ కొన్నిసార్లు మాత్రం ఛాలెంజ్ గట్టిగా ఉంటుంది. క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. అలాంటి రోల్స్‌కి యాక్టర్స్ ‘యస్’ అన్నారంటే... సిల్వర్ స్క్రీన్ మీద తప్పకుండా మ్యాజిక్ జరుగుతుంది. ప్రస్తుతం కొందరు స్టార్స్‌ని అలాంటి రోల్స్ ఛాలెంజ్ చేశాయి. ‘తగ్గేదే లే’ అంటూ ఆ సవాల్‌ని స్వీకరించారు. ఆ విశేషాలేంటో చూద్దాం.
భారమంతా భుజం పైనే!
సాధారణంగా మాస్ కమర్షియల్ సినిమాల బరువంతా స్టార్ హీరోల భుజాలపైనే ఉంటుంది. ఎందుకంటే సినిమాకు సెంటరాఫ్ అట్రాక్షన్ హీరోయే. అలాంటి భారీ సినిమాలను మోయాలంటే హీరో భుజాలు ఎంత బలంగా ఉండాలి! కానీ షోల్డర్ ఇన్‌బ్యాలెన్స్‌తోనే పాన్ ఇండియా సినిమాకు సిద్ధమయ్యారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం ‘పుష్ప’. ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్పరాజ్ అనే మాస్ పాత్రలో కనిపిస్తారు బన్నీ.
గుబురు గడ్డం, రింగులు తిరిగిన జుట్టు, కమిలిని చర్మంతో బన్నీ డీ–గ్లామరస్ పాత్రలో కనిపిస్తారని తెలిసిందే. అలాగే షోల్డర్ ఇన్‌బ్యాలెన్స్ (భుజ అసమతుల్యత) ఉన్న వ్యక్తిగా బన్నీ కనిపిస్తారనే ఫీల్‌ని ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘నిను చుస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే..’ పాట కలగజేస్తోంది. భుజ అసమతుల్యత భారాన్ని తన భుజం మీద బన్నీ బాగా మోసిన విషయం పాటలో కనిపిస్తోందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాలో బన్నీ ‘తగ్గేదే లే’ అని డైలాగ్ చెబుతారు. నటన పరంగా తగ్గేదే లే అంటూ ఈ పాత్రను సవాల్‌గా తీసుకుని చేశారు. ‘పుష్ప’ డిసెంబర్ 17న విడుదల కానుంది.
చదవండి: ఆ సినిమాలో సాయి పల్లవిపై స్పెషల్ సాంగ్, ఈసారి క్లాసికల్ టచ్‌తో..!
పాప కోసం ఒంటి కాలితో...
ప్రభుదేవా మ్యాజిక్ అంతా ఆయన కాళ్లలోనే ఉంది. మెరుపు వేగంతో కాళ్లను ఆడించే నైపుణ్యం ఉన్న డ్యాన్సర్ ప్రభుదేవా. ఆయన కాళ్లలోని చురుకుదనానికి ఇన్నేళ్లు ఈలలు వేశారు. ఇప్పుడు ఓ కొత్త ఛాలెంజ్‌కి రెడీ అయ్యారు ప్రభుదేవా. ‘పొయ్ కాల్ కుదిరై’ (కృత్రిమ కాలు ఉన్న గుర్రం అని అర్థం) సినిమాలో ప్రభుదేవా ఒక కాలు లేని వ్యక్తిగా కనిపించనున్నారు. కృత్రిమ కాలు ధరించి ఉన్న ఆయన లుక్ ఇటీవల విడుదలయింది. ఈ చిత్రంలో శత్రువుల బారి నుంచి ఓ పాపను కాపాడే పాత్రను ప్రభుదేవా చేస్తున్నారని తెలుస్తోంది. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
ట్రాక్‌లో సవాల్
హీరోగా, విలన్‌గా ప్రూవ్ చేసుకుంటూ కెరీర్ ట్రాక్‌లో దూసుకెళుతున్నారు ఆది పినిశెట్టి. ఇప్పుడు ‘క్లాప్’ సినిమాలో రన్నర్ ట్రాక్ ఎక్కారు. ఇందులో జాతీయ స్థాయిలో రన్నింగ్ రేస్‌లో బంగారు పతాకం సాధించాలనే పాత్రలో కనిపించనున్నారు. అయితే మధ్యలో తన కుడి కాలుని పోగొట్టుకుంటారు. కృత్రిమ కాలుతో తన ప్రయాణాన్ని ఈ రన్నర్ మళ్లీ మొదలుపెడతాడా? అనేది కథ. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆకాంక్షా సింగ్ కథానాయిక. ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్యా దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment