అనుకోని మలుపు | 'Malupu' audio launch on June 14 | Sakshi
Sakshi News home page

అనుకోని మలుపు

Published Tue, Jun 9 2015 11:12 PM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

అనుకోని మలుపు

అనుకోని మలుపు

జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో ఓ యువకుడు ముంబయ్‌లోకి అడుగుపెట్టాడు. కానీ అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల ముంబయ్ మాఫియా అతని జీవితంలోకి అడుగుపెట్టింది. అలాంటి సందర్భంలో జీవితంలోని సవాళ్లను అతనెలా ఎదుర్కొన్నాడో  తెలియాలంటే ‘మలుపు’ చూడాల్సిందే అంటున్నారు సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి. ఆయన తొలిసారిగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన తనయుడు ఆది పినిశెట్టి, నిఖిత  జంటగా నటిస్తున్నారు.  ఈ చిత్రానికి ఆయన మరో తనయుడు సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకుడు. ఈ నెల 14న పాటలను, 26న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘‘స్నేహం, ప్రేమ, యాక్షన్ నేపథ్యంలో సాగే  ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రసన్, ప్రవీణ్, శ్యామ్, కెమెరా: షణ్ముగ సుందరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement