
నటి హమీదా సాహసం సేయరా డింభకా సినిమాలో నటించింది. అందంచందం ఉన్నప్పటికీ ఈమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో టాలీవుడ్‌లో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఈ నటి బిగ్‌బాస్ ద్వారా తన కెరీర్‌ను గాడిలో పెట్టాలనుకుంటోంది. బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో పదకొండో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన హమీదా.. అబ్బాయిల్లో తనకు హైట్, కళ్లు, చిరునవ్వు, హెయిర్ స్టైలింగ్ అంటే ఇష్టమని చెప్పింది. దీంతో బిగ్‌బాస్ స్క్రీన్‌పై ఇతర మేల్ కంటెస్టెంట్ల కళ్లు మాత్రమే చూపించాడు. అందులో ఒకరి కళ్లు తనకు బాగా నచ్చాయని చెప్పింది హమీదా. మరి ఆ కళ్లు ఎవరివి? వారి మధ్య స్నేహం చిగురిస్తుందా? అన్నది మున్ముందు తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment