కోరుకున్న ప్రతీది మన సొంతం కాదు, అది వస్తువు అయినా, ప్రేమ అయినా! హమీదా విషయంలో ఇదే జరిగింది. కాకపోతే ఆ ప్రేమ పొందినట్లే పొంది అంతలోనే చేజారిపోయింది. ఆ ప్రేమ ముచ్చట్లను మరోసారి గుర్తు చేసుకుంటూ కంతడి పెట్టుకుంది హమీదా. బిగ్‌బాస్ అన్‌సీన్ వీడియోలో హమీదా తన తొలి ప్రేమ కథను వెల్లడించింది. "మాది మూడేళ్ల ప్రేమనో, పదేళ్ల ప్రేమనో తెలియడం లేదు. మా మధ్య ఎప్పుడూ బ్రేకప్ అవ్వలేదు, కానీ కలిసి ఉండలేకపోతున్నాం. నా ఫ్యామిలీ కోసం వాడిని వదులుకున్నా. వాడి పేరు తల్చుకున్నా కూడా ఏడుపొస్తుంది. వాడిని జాన్ అని పిలిచేదాన్ని, ఇప్పటికీ తను నాకు జానే. నేను వాడికి న్యాయం చేశానా? అన్యాయం చేశానా? నాకు తెలియదు."
"కానీ వాడే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్. మేము కలిసి తిరిగిన జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నా. ఐదేళ్ల తర్వాత కలిసినప్పుడు వాడికి చెప్పాను.. స్టిల్ ఐ లవ్‌యూ అని! దానికతడు లేట్ అయిపోయిందన్నాడు. అప్పుడు నేను ఏమన్నానంటే.. నువ్వు ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకపోతే ఇలానే సోలోగా, ఫ్యామిలీతో ఉండిపోతాను అని చెప్పాను. వాడిని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు ఫోన్ చేసినా కూడా లవ్ యూ అని చెప్తూనే ఉంటాను. వాడు కూడా లవ్ యూ టూ అంటాడు, కానీ తనకు నా మీద నమ్మకం లేదు. మళ్లీ నేను ఫ్యామిలీ దగ్గరకు వెళ్లిపోయి ఎక్కడ వదిలేస్తానో అనుకుంటున్నాడు. ఈ ప్రేమ విషయం నా పేరెంట్స్‌కు కూడా ఇంతవరకు చెప్పలేదు. కానీ వాళ్ల కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. తనతో ఉన్న జ్ఞాపకాలను డిలీట్ చేశాను" అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది హమీదా.
Comments
Please login to add a commentAdd a comment