
పంకజ్ అద్వానీ ఓటమి
బీజింగ్: ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు సన్నాహక టోర్నీ అయిన చైనా ఓపెన్ స్నూకర్‌లో భారత క్రీడాకారులు పంకజ్ అద్వానీ, ఆదిత్య మెహతా నిరాశపరిచారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు.
మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో అద్వానీ 1-5 (8-81, 74-0, 25-83, 8-73, 10-72-10, 42-62)తో రికీ వాల్డెన్ (ఇంగ్లండ్) చేతిలో... ఆదిత్య మెహతా 4-5 (52-60, 57-52, 1-69, 79-49, 0-81, 62-48, 22-73, 62-40, 36-71)తో మార్క్ కింగ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయారు. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్ ఇంగ్లండ్‌లోని షెఫ్‌ఫీల్డ్‌లో ఈ నెల 16న మొదలు కానుంది.