స్నే‘కింగ్’ ఆనంద్
పేరు : ఆనంద్
ఉంటున్నందిః సింధియాలోని న్యూకాలనీ
వత్తిః చిరు వ్యాపారి ( తోపుడు బండిపై ఇడ్లీ అమ్ముతాడు)
ప్రవత్తి పాములు పట్టడం
సెల్ నంబర్ 98490 23527
పాములను చూస్తే అందరూ భయపడతారు. ఎక్కడ కాటు వేస్తుందోనని పరుగులు తీస్తారు. ఆనంద్ మాత్రం వాటితో ఆడుకుంటాడు. చాకచక్యంగా పట్టుకుంటాడు. పట్నాల ఆనంద్ సింధియా,న్యూకాలనీలో ఉంటున్నాడు. అందరిలాగే ఆనంద్‌కు సర్పాలంటే చిన్నతనంలో భయమే.అయితే 15 సంవత్సారల క్రితం న్యూకాలనీలో బుజ్జి అనే పదేళ్ల బాలుడ్ని కొండచిలువ చుట్టేసి కలవరం సష్టించింది. అక్కడ వారంతా భయంతో దూరంగా జరిగారే తప్పా బాలుడ్ని రక్షించే సాహసం చేయలేదు. ఆ సమయంలో ఆనంద్ ధైర్యం చేసి ఆ కొండచిలువను బలంగా లాగి దూరంగా విసిరేసి ఆ బాలుని రక్షించాడు. అదేlమాదిరిగా స్నేహితులతో యారాడ వెళ్లినప్పుడు ఓ విషసర్పం వీరిపై దూసుకు వస్తుంటే ఆనంద్ ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ సర్పాన్ని బంధించి కొండపై విడిచిపెట్టాడు. అప్పట్నించీ ఆనంద్ పాముల ఆనంద్‌గా మారిపోయాడు. ఇంతవరకూ రెండు వేల వరకూ వివిధ రకాల పాములను పట్టుకుని అటవీప్రాంతంలో విడిచిపెట్టాడు. ఆనంద్ ధైర్యాన్ని చూసి ఇండియన్ నేవి,షిప్‌యార్డ్ తదితర పరిశ్రమల వారు ఆయా ప్రాంతాల్లో సర్పాలు సంచరిస్తే ఫోన్ చేస్తారు. నెలకు కొంతమొత్తాన్ని ఇస్తారు. చిన్న టిఫిన్‌దుకాణం నడుపుకుంటూ బతుకుతున్నాడు. ఎవరైనా ఫోన్ చేస్తే తక్షణం స్పందించి పాములు పడతాడు. –మల్కాపురం