
అద్వానీ... అత్యధిక బ్రేక్
షెఫీల్డ్ (యూకే): వారం రోజుల వ్యవధిలో రెండు బిలియర్డ్స్ ప్రపంచ టైటిల్స్‌ను సాధించిన భారత స్టార్ పంకజ్ అద్వానీ... స్నూకర్‌లోనూ సత్తా చాటాడు.
షెఫీల్డ్ (యూకే): వారం రోజుల వ్యవధిలో రెండు బిలియర్డ్స్ ప్రపంచ టైటిల్స్‌ను సాధించిన భారత స్టార్ పంకజ్ అద్వానీ... స్నూకర్‌లోనూ సత్తా చాటాడు. కియోగన్ (ఇంగ్లండ్)తో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో పంకజ్ అద్వానీ అత్యధికంగా 147 పాయింట్లు స్కోరు చేశాడు. స్నూకర్‌లో సాధారణంగా 147 పాయింట్లనే అత్యధిక బ్రేక్‌గా పరిగణిస్తారు. ఇప్పటివరకు ఈ తరహా బ్రేక్‌ను అధికారికంగా 107 మంది చేయగా... భారత్ నుంచి ఆదిత్య మెహతా మాత్రమే చేశాడు.