పాతబస్తీలో దారుణం | Snooker Parlor Manager Attacked By Rowdy Gang At Midnight | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో దారుణం

Published Thu, Sep 7 2017 11:11 AM | Last Updated on Mon, Oct 22 2018 5:42 PM

Snooker Parlor Manager Attacked By Rowdy Gang At Midnight

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. డబీర్‌పురలోని గ్రాండ్‌ స్కూకర్‌ పార్లర్‌లో ఓ యువకుడిపై కొందరు దుండగులు కత్తులు, బేస్‌బాల్‌ స్టిక్స్‌తో దాడి చేశారు. స్నూకర్‌ పార్లర్‌లో పని చేస్తున్న షబ్బీర్‌ హుస్సేన్‌(27)పై బుధవారం అర్ధరాత్రి ముగ్గురు దుండగులు విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
 
రంగంలోకి దిగిన పోలీసులు స్నూకర్‌పాయింట్‌ను సీజ్‌ చేయడంతో పాటు ముగ్గురు ప్రధాన నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారు హమీద్‌, మొహియినుద్దీన్‌, తఫ్సీల్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement