సెమీస్‌లో రాజీవ్, పాండురంగయ్య | rajiv enters semis of telangana open snooker championship | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో రాజీవ్, పాండురంగయ్య

Published Sat, Aug 12 2017 10:35 AM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM

సెమీస్‌లో రాజీవ్, పాండురంగయ్య

సెమీస్‌లో రాజీవ్, పాండురంగయ్య

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఓపెన్‌ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో రాజీవ్‌ ఇనుగంటి, ఇ. పాండురంగయ్య సెమీఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో రాజీవ్‌ 5–4 (62–24, 29–57, 09–89, 16–14, 59–56, 31–60, 72–35, 41–70, 58–24)తో అజయ్‌ భూషణ్‌పై గెలుపొందగా, పాండురంగయ్య 5–2 (76–39, 49–73, 73–33, 59–68, 73–17, 66–23, 47–23)తో బాలకృష్ణను ఓడించాడు.

 

అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో విశాల్‌ అగర్వాల్‌ 4–1 (69–38, 89–09, 42–52, 66–55, 59–38)తో కె. వెంకటేశంపై, లక్కీ వత్నాని 4–3 (65–13, 21–66, 61–41, 44–60, 51–58, 51–49, 57–23)తో నరేశ్‌ కుమార్‌పై, హిమాన్షు జైన్‌ 4–2 (54–16, 24–56, 67–32, 71–34, 46–61, 62–52)తో అబిద్‌ అలీపై, దుర్గా ప్రసాద్‌ 4–0 (67–37, 72–18, 71–41, 54–05)తో తరుణ్‌ గుప్తాపై గెలుపొంది క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement