Telangana Open Snooker Championship
-
విజేత లక్కీ వత్నాని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన క్యూయిస్ట్ లక్కీ వత్నాని సత్తా చాటాడు. 214 మంది క్రీడాకారులు తలపడిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో లక్కీ వత్నాని (హైదరాబాద్) 67–15, 70–57, 79–72, 74–47, 08–84, 49–50, 79–21, 61–04తో రాజీవ్ ఇనుగంటి (కాకినాడ)పై విజయం సాధించాడు. 15 రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ, ఏపీ, సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. -
సెమీస్‌లో రాజీవ్, పాండురంగయ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో రాజీవ్ ఇనుగంటి, ఇ. పాండురంగయ్య సెమీఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో రాజీవ్ 5–4 (62–24, 29–57, 09–89, 16–14, 59–56, 31–60, 72–35, 41–70, 58–24)తో అజయ్ భూషణ్‌పై గెలుపొందగా, పాండురంగయ్య 5–2 (76–39, 49–73, 73–33, 59–68, 73–17, 66–23, 47–23)తో బాలకృష్ణను ఓడించాడు. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో విశాల్ అగర్వాల్ 4–1 (69–38, 89–09, 42–52, 66–55, 59–38)తో కె. వెంకటేశంపై, లక్కీ వత్నాని 4–3 (65–13, 21–66, 61–41, 44–60, 51–58, 51–49, 57–23)తో నరేశ్ కుమార్‌పై, హిమాన్షు జైన్ 4–2 (54–16, 24–56, 67–32, 71–34, 46–61, 62–52)తో అబిద్ అలీపై, దుర్గా ప్రసాద్ 4–0 (67–37, 72–18, 71–41, 54–05)తో తరుణ్ గుప్తాపై గెలుపొంది క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. -
క్వార్టర్స్‌లో అజయ్, రాజీవ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో అజయ్ భూషణ్, రాజీవ్ ఇనుగంటి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో అజయ్ 4–3 (21–63, 65–35, 43–44, 59–7, 76–38, 11–65, 87–38)తో రషీద్ ఖురేషిపై గెలుపొందగా, రాజీవ్ 4–2 (69–43, 73–01, 25–67, 65–17, 42–92, 61–34)తో ఖైజర్ రవూఫ్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో బాలకృష్ణ 4–1 (70–25, 56–21, 58–51, 44–64, 77–32)తో పి. హేమంత్ కుమార్‌పై, ఇ. పాండురంగయ్య 4–0 (65–26, 61–32, 59–37, 72–45)తో సయ్యద్ అహ్మద్ హుస్సేన్‌పై గెలుపొందారు. అంతకుముందు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో లక్కీ వత్నానీ 4–3 (51–78, 69–34, 59–24, 45–56, 71–55, 45–57, 49–37)తో జేమ్స్ సుందర్ రాజ్‌పై, నరేశ్ కుమార్ 4–3 (70–43, 45–59, 47–17, 49–35, 51–60, 54–13)తో క్లింటన్‌పై, కె. వెంకటేశం 4–3 (53–66, 82–33, 82–37, 54–12, 27–60, 52–62, 57–22)తో మొహమ్మద్ గౌస్‌పై, విశాల్ అగర్వాల్ 4–1 (87–33, 54–32, 51–63, 67–22, 60–58)తో బీఎల్ ధీరజ్‌పై, మీర్ అబిద్ అలీ 4–2 (62–24, 79–08, 54–32, 23–58, 30–60, 57–28)తో అశ్విన్ రావుపై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించారు.