లండన్: ఫిక్సింగ్... క్రికెట్‌తోపాటు ఇతర క్రీడలనూ కుదిపేస్తోన్న ఈ జాడ్యం ఇప్పుడు స్నూకర్‌లోనూ బయటపడింది. ప్రపంచ మాజీ ఐదో ర్యాంకర్ స్టీఫెన్ లీ (ఇంగ్లండ్)... ఏడు మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని వరల్డ్ ప్రొఫెషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ అసోసియేషన్ (డబ్ల్యూపీబీఎస్‌ఏ) ప్రకటించింది. ఈ మ్యాచ్‌లన్నింటిలో కలిపి అతను లక్షా 11 వేల పౌండ్లు బెట్టింగ్ చేశాడని సమాచారం. విచారణలో దోషిగా తేలితే లీపై జీవితకాల నిషేధం విధించే అవకాశాలున్నాయి.