Billiards sport
-
రంపం మెషిన్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టార్ స్నూకర్
పాకిస్తాన్‌కు చెందిన అంతర్జాతీయ స్నూకర్ స్టార్ , అండర్-21 మెడలిస్ట్ మాజిద్ అలీ ఆత్యహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి పంజాబ్(పాకిస్తాన్)లోని ఫైసలాబాద్‌లో తన ఇంట్లోనే రంపం మెషిన్‌తో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. కొంతకాలంగా మాజిద్ అలీ మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు పోలీసులు నిర్థారించారు. అతనికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని.. నిరాశ నిసృహల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్ తరపున చిన్న వయసులోనే స్నూకర్ గేమ్(బిలియర్డ్స్)లో సంచలనాలు సృష్టించిన మాజిద్ అలీ జాతీయ స్థాయిలో చాలాకాలం పాటు నెంబర్‌వన్‌గా కొనసాగాడు. పాకిస్తాన్లో అంతర్జాతీయ స్నూకర్ పోటీలకు బాగా క్రేజ్ ఉంది. మాజీలు మహ్మద్ యూసఫ్, ముహ్మద్ ఆసిఫ్‌లు వరల్డ్, ఆసియా చాంపియన్‌షిప్‌లు గెలుచుకున్నారు. వారి తర్వాత స్నూకర్‌లో మంచి పేరు తెచ్చుకున్న 28 ఏళ్ల మాజిద్ అలీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఈ నెల ఆరంభంలో మరో అంతర్జాతీయ స్నూకర్ ముహమ్మద్ బిలాల్ గుండెపోటుతో మరణించాడు. తాజాగా నెల వ్యవధిలోనే పాకిస్తాన్ స్నూకర్ స్టార్ ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. మాజిద్ అలీ సోదరుడు ఉమర్ మాజిద్ మాట్లాడుతూ.. ''టీనేజీ వయసు నుంచే వాడు(మాజిద్ అలీ) మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. అయితే ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం ఊహించలేదు. వాడి మరణం మాకు తీరని లోటు'' అని పేర్కొన్నాడు. పాకిస్తాన్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ చైర్మన్ అలమ్‌గిర్ షేక్ స్పందిస్తూ.. ''మాజిద్ మరణం ఎంతో బాధాకరం. ఎంతో టాలెంట్ కలిగిన అతను బిలియర్డ్స్ గేమ్‌లో పాకిస్తాన్‌ను ఉన్నత స్థానంలో నిలిపాడు. అతనికిదే మా అశ్రు నివాలి'' అంటూ తెలిపాడు. చదవండి: అభిమానుల డిమాండ్; అశ్లీల వెబ్సైట్లో జాయిన్ అయిన ఫుట్‌బాలర్ FIFA Rankings: టైటిల్ సాధించి.. టాప్- 100లో.. .. 1996లో అత్యుత్తమంగా.. -
‘క్యూ స్లామ్’కు శ్రీకారం
ఆగస్ట్ 19నుంచి మాస్టర్స్ లీగ్ హైదరాబాద్: బిలియర్డ్స్ క్రీడను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త తరహా ఆటను చూపించక తప్పని పరిస్థితి ఏర్పడిందని భారత దిగ్గజం, 16 సార్లు వరల్డ్ చాంపియన్ పంకజ్ అద్వానీ అభిప్రాయ పడ్డాడు. ఈ క్రమంలో తొలి సారి భారత్‌లో ‘క్యూ లీగ్’కు శ్రీకారం చుట్టినట్లు అతను చెప్పాడు. ‘ఇండియన్ క్యూ మాస్టర్స్ లీగ్’ పేరుతో ఆగస్టు 19నుంచి 25 వరకు ఈ టోర్నీ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. స్పోర్ట్స్ లైవ్ సంస్థ ఈ లీగ్‌కు ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ హస్లర్స్, ఢిల్లీ డాన్స్, చెన్నై షార్క్స్, గుజరాత్ కింగ్స్, బెంగళూరు బడ్డీస్ పేర్లతో 5 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఒక్కో జట్టులో ఐదుగురు చొప్పున 25 మంది ఆటగాళ్లు ఈ లీగ్ బరిలోకి దిగుతున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో భారత బిలియర్డ్స్ సమాఖ్య కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, స్పోర్ట్స్ లైవ్ ప్రతినిధులు ప్రసాద్, అతుల్ పాల్గొన్నారు.