communal clash
-
మత ఘర్షణల కేసులో ట్విస్ట్.. ఖైదీలపై కేసు!
శ్రీ రామ నవమి సందర్భంగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి మధ్యప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. పోలీసులు మత ఘర్షణల పేరిట ముగ్గురిపై కేసు నమోదు చేయగా.. వాళ్లు ఘర్షణల కంటే నెల ముందు నుంచే జైళ్లో ఉన్నారనే విషయం బయటకు వచ్చింది. హత్యాయత్నం పేరిట దాఖలైన ఓ కేసులో ఆ ముగ్గురు.. మార్చి 5వ తేదీ నుంచి జైల్లోనే ఉన్నారన్న విషయం ఎఫ్ఐఆర్ కాపీ బయటకు రావడంతో వెలుగు చూసింది. ఆల్రెడీ జైల్లో ఉన్న ఈ ముగ్గురిపై విచిత్రంగా.. ఏప్రిల్ 10న బార్వాని జిల్లా సెంద్వా దగ్గర చోటుచేసుకున్న అల్లర్లలో ఓ మోటర్ బైక్‌ను తగలబెట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకో కొసమెరుపు ఏంటంటే.. హత్యాయత్నం కేసు నమోదు అయిన పోలీస్ స్టేషన్లోనే.. ఇప్పుడు ఈ మతఘర్షణల కేసు కూడా ఫైల్ కావడం. దీని గురించి ఉన్నతాధికారుల్ని మీడియా ఆరా తీయగా.. ఫిర్యాదుదారుని(వివరాలు వెల్లడించలేదు) ఆరోపణల మేరకు కేసు నమోదు చేశామని, దీనిపై విచారణ చేపట్టి జైలు సూపరింటెండెంట్ నుంచి సమాచారం తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆదివారం శ్రీరామనవమి సందర్బంగా.. ఉరేగింపులపై ఖార్గాన్, బర్వానీ జిల్లాల్లో రెండు చోట్ల రాళ్లు రువ్విన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఘటనల్లో 24 మంది, ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. దాడుల్లో పాల్గొన్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. దీంతో అధికారులు 16 ఇళ్లు, 29 దుకాణాలను కూల్చేశారు. ఇక సెంద్వాలో బైక్‌ను తగలబెట్టారన్న ఆరోపణలపై షాబాజ్, ఫక్రూ, రౌఫ్‌లపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ముగ్గురిలో ఒకడైన షాబాజ్ ఇంటిని అక్రమ కట్టడంగా ఆరోపిస్తూ అధికారులు దగ్గురుండి బుల్డోజర్లతో కూల్చేయించారు కూడా. ఆ సమయంలో షాబాజ్ తల్లి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేయడంపై చేతులెత్తి వేడుకుంది.. తమ కొడుకు అప్పటికే జైల్లో ఉన్నాడని అధికారులకు చెప్పింది.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది కూడా. సంబంధిత వార్త: మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అసదుద్దీన్ సవాల్ -
మమతకు ఈసీ నోటీసు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థిస్తున్నారన్న బీజేపీ ఫిర్యాదుపై తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం బుధవారం నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు 48 గంట ల్లోగా స్పందించాలని ఆదేశించింది. హూగ్లీ జిల్లాలో ని తారకేశ్వర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగిస్తూ.. ముస్లింలంతా టీఎంసీకే ఓటేయాలని, వేర్వేరు పార్టీలకు వేసి ఓట్లను చీల్చవద్దని కోరారు. దీనిపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దాంతో, ఆ వ్యాఖ్యలు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈసీ మమతకు నోటీసు జారీ చేసింది. ‘మైనారిటీల కోసం ఐక్యశ్రీ పథకం ప్రారంభించాం. 2.35 లక్షల మంది మైనారిటీలకు లబ్ధి చేకూర్చాం. మైనారిటీ సోదర, సోదరీమణులకు చేతులెత్తి ప్రార్థిస్తున్నా. మైనారిటీ ఓట్లను చీల్చకండి. బీజేపీ నుంచి డబ్బులు తీసుకున్న ఆ సైతాను మాటలను నమ్మకండి. అతడు హిందూ, ముస్లిం ఘర్షణలు చెలరేగాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎన్నో చేస్తుంటాడు. బీజేపీ రహస్య మిత్రుల్లో అతడు ఒకడు. ఇటు సీపీఎం, బీజేపీ నేతలు మైనారిటీ ఓట్లను చీల్చేందుకు బీజేపీ ఇచ్చిన డబ్బులు పంచుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మీరు పెద్ద ప్రమాదంలో పడ్తారు. నా హిందూ కుటుంబ సభ్యులను అభ్యర్థిస్తున్నా. బీజేపీ మాటలు విని హిందూ, ముస్లింలుగా మీరు విడిపోవద్దు’ అని మమత ప్రసంగించారని బీజేపీ పేర్కొంది. -
అట్టుడికిన భైంసా
నిర్మల్/భైంసా, సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణం సోమవారం అట్టుడికిపోయింది. 2 వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం రాళ్ల దాడులు, వాహనాల ధ్వంసం, గృహ దహనాలకు దారితీసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ ఈ దాడులు కొనసాగాయి. దీంతో పట్టణంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. అగ్గిరాజేసిన వివాదం... భైంసాలోని కోర్బా గల్లీలో ఆదివారం రాత్రి ఓ వర్గానికి చెందిన యువకుడు బైక్‌పై పెద్ద శబ్దం చేస్తూ ఇష్టానుసారంగా వెళ్లడంతో స్థానికులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన అతను కాసేపటికి తన వర్గం వారిని వెంటబెట్టుకొని వచ్చి ఒక వర్గానికి చెందిన ఇళ్లు, ఆస్తులు లక్ష్యంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా కాలిపోగా 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అల్లరిమూకలు 24 ద్విచక్ర వాహనాలు, ఓ కారు, ఆటో మరికొన్ని వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇళ్లలోంచి సిలిండర్లు, వస్తు సామగ్రిని రోడ్డుపై పడేసి తగులబెట్టారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన దాడులు సోమవారం పట్టణమంతా విస్తరించాయి. ఒక వర్గం చేసిన దాడికి మరో వర్గం వారు ప్రతీకారంతో ప్రతి దాడులకు దిగారు. అల్లరి మూకలను కట్టడి చేసేందుకు వచ్చిన నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజుతోపాటు భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావు, సీఐ వేణుగోపాలరావు, ముథోల్ ఎస్సై అశోక్, ఐదుగురు కానిస్టేబుళ్లు సైతం రాళ్ల దాడిలో గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, సీఐడీ ఐజీ ప్రమోద్ కుమార్, రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ, సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల ఎస్పీలు విష్ణు వారియర్, శ్వేతారెడ్డి, రాహుల్ హెగ్డే హుటాహుటిన భైంసా చేరుకున్నారు. ఆదిలాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, సిరిసిల్ల, రామగుండం, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. సోమవారం సాయంత్రం ఆర్ఏఎఫ్ దళాలు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భైంసాలో బుధవారం వరకు 144 సెక్షన్ విధించారు. బిక్కుబిక్కుమంటూ.. కొన్నేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న పట్టణం ఉద్రిక్తంగా మారడంతో భైంసావాసులు భయంభయంగా గడుపుతున్నారు. 100 మందికిపైగా మహిళలు, పిల్లలు ప్రార్థనా మందిరంలో తలదాచుకున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీళ్లు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. తమ కళ్ల ముందే ఇళ్లు, ఆస్తులు, ధ్వంసం కావడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. పలువురు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఊళ్లకు వెళ్లిపోయారు. బాధితులను ఆదుకుంటాం: కలెక్టర్ దాడులు జరిగిన ప్రాంతాల్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామన్నారు. డీజీపీ ఆగ్రహం! తొలి నుంచీ సున్నిత ప్రాంతమైన భైంసాలో మున్సిపల్ ఎన్నికల వేళ హింస చెలరేగడంపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఘటన పూర్వాపరాలతో పూర్తి నివేదిక సమర్పించాలని నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజును డీజీపీ ఆదేశించారని సమాచారం. భైంసా ఎన్నిక వాయిదా వేయాలి: బీజేపీ భైంసా మున్సిపాలిటీ ఎన్నికను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి బీజేపీ విజ్ఞప్తి చేసింది. శాంతియుత వాతావరణంలో, స్వేచ్ఛగా మరో తేదీన ఎన్నిక నిర్వహణకు చర్యలు తీసుకోవా లని కోరింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి బృందం సోమవారం నాగిరెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించింది. దాడులు ఎంఐఎం పనే: కె.లక్ష్మణ్ నిర్మల్ జిల్లా భైంసాలో ఎంఐఎం గూండాలు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించేందుకు టీఆర్ఎస్, ఎంఐ ఎం కుట్రపన్నుతున్నట్లు ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: ఒవైసీ బైంసా ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సీఎం కేసీఆర్, డీజీపీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. నిర్మల్‌లో జరిగిన తబ్లిక్ ఇజ్తేమాకు వెళ్లొస్తున్న వారిపై దాడి జరగడం అమానుషమన్నారు. -
దారుణంగా కొట్టి యువకుడి హత్య
జైపూర్ : అన్యమత యువతిని ప్రేమించడమే అతడి పాలిట శాపమైంది. ఆ ప్రేమే అతడి ప్రాణాలు బలిగొంది. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బికనీర్ పట్టణానికి చెందిన సైఫ్ అలీఖాన్(22) అనే యువకుడు ఓ హిందూ యువతిని ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి కుటుంబానికి తెలియడంతో ఆమెకు వివాహం నిశ్చయించారు. అయినప్పటికీ అలీఖాన్‌తో ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో యువతి తండ్రి, సోదరులు అతడిపై కక్ష పెంచుకున్నారు. అన్యమతానికి చెందిన యువకుడు తమ అమ్మాయిని ప్రేమించడంతో ఆమె తండ్రి మరో ఆరుగురితో కలిసి అలీఖాన్‌ను దారుణంగా కొట్టి మురికి కాలువలో పడేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన పోలీసుల దృష్టికి రావడంతో వారు అలీఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం అతడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో యువతి తండ్రి శివకుమార్ మాలితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. అయితే హత్యపై పలు అనుమానాలు నెలకొనడంతో మతపరమైన అల్లర్ల కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు ఎస్సై భజన్‌లాల్ తెలిపారు. -
‘ఆ ఘర్షణల వెనుక బీజేపీ, బజరంగ్దళ్’
పట్నా : గత నెల 25న జరిగిన శ్రీరామ నవమి ర్యాలీలలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు భారతీయ జనతా పార్టీ, బజరంగ్ దళ్ కారణంగానే జరిగినట్టు ఓ నివేదిక పేర్కొంది. ఈ నెల 9న ‘యునైటెడ్ ఏజెంట్ హేట్’ అనే సంస్థ ఘర్షణలు జరగడానికి గల కారణాలను మీడియాకు వివరిస్తూ.. ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్స్ అనే రిపోర్టును విడుదల చేసింది. ఈ సంస్థకు చెందిన కొంతమంది ఏప్రిల్ 3 నుంచి 7 తేదీ వరకు బిహార్‌లో ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో పర్యటించారు. నివేదిక ప్రకారం, వారు పర్యటించిన జిల్లాల్లో ఘర్షణల వెనుక కొన్ని సారూప్యతలు కనుగొన్నట్టు తెలిపారు. ఈ ఘర్షణల వెనుక బీజేపీ, బజరంగ్ దళ్ హస్తం ఉన్నట్టు నివేదికలో తెలిపారు. చాలావరకు ఘర్షణలు జరిగిన తీరు ఒకే రీతిలో ఉందని అన్నారు. కొత్తగా ఏర్పాటైన కొన్ని సంఘాలు జిల్లా అధికారుల నుంచి రామ నవమి ర్యాలీల కోసం అనుమతి పొందాయని, ఘర్షణలు జరిగిన జిల్లాల్లో అప్పటికప్పుడు కొన్ని కొత్త సంఘాలు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. ర్యాలీ నిర్వహించేటప్పుడు యువకులు వందల సంఖ్యలో ద్విచక్రవాహనాలపై రావడం, కత్తులతో, తుపాకులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవిధంగా ప్రదర్శనలు నిర్వహించాయని పేర్కొన్నారు. ఇతర మతస్తులు అధికంగా నివాసముండే ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించడం కూడా ఘర్షణలకు దారితీసిందని తెలిపారు. గత కొన్ని సంత్సరాలుగా సంప్రదాయబద్ధంగా ర్యాలీలను నిర్వహిస్తున్న సంస్థలు ఇటువంటి పనులకు దూరంగా ఉన్నాయని వెల్లడించారు. దురుద్దేశంతో కొంతమంది కావాలనే కొన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారని, వారి దుకాణాలను తగలబెట్టడం, ఇళ్లపై రాళ్లు విసరడం వంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. -
నేను బతికే ఉన్నాను.. మహాప్రభో..!
లక్నో: ఉత్తరప్రదేశ్ కాస్గంజ్లో మతఘర్షణలు తీవ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణం.. రాహుల్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి మృతి చెందాడని వదంతులు చెలరేగడమే.. నిజానికి రాహుల్ ఉపాధ్యాయ్ మరణించలేదు. ఆ విషయాన్ని పోలీసులు సోమవారం స్పష్టం చేశారు. మంగళవారం రాహుల్ ఉపాధ్యాయ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి.. తాను చనిపోలేదని స్పష్టత ఇచ్చాడు. ‘కాస్గంజ్ అల్లర్లలో నేను చనిపోయినట్టు సోషల్ మీడియాలో వదంతులు చెలరేగుతున్నట్టు నా స్నేహితుడు ఒకరు తెలిపారు. కానీ, అల్లర్లు జరిగిన సమయంలో నేను కాస్గంజ్లో లేను. నేను ఊరికి వెళ్లాను. నేను బాగున్నాను’ అని రాహుల్ వివరించాడు. రాహుల్ మృతి చెందాడని వదంతులు వ్యాప్తి చేస్తూ.. మతఘర్షణలను మరింత రెచ్చగొట్టాలని చూస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్టు అలీగఢ్ రేంజ్ ఐజీ సంజీవ్ గుప్తా తెలిపారు. గణతంత్ర దినోత్సవం నాడు ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో చందన్ గుప్తాతోపాటు రాహుల్ ఉపాధ్యాయ్ కూడా చనిపోయాడని తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొట్టాయి. రాహుల్ మృతి చెందాడన్న వదంతులను నమ్మిన మూక.. గత మూడురోజులుగా హింసకు దిగుతోంది. గణతంత్ర దినోత్సవం నాడు చేపట్టిన ‘తిరంగ యాత్ర’ ఉద్రిక్తతలకు దారితీసి.. ఒకరి మృతికి, ఇద్దరు గాయపడటానికి కారణమైంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 51మందిపై అభియోగాలు నమోదుచేశారు. -
చిచ్చు రాజేసిన టాయ్‌లెట్, మత ఘర్షణలు
లక్నో : మరుగుదొడ్డి విషయంలో నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఏకంగా మత ఘర్షణలకు దారితీసి ఉత్తర ప్రదేశ్‌లో ఒకరి ప్రాణాలు బలిగింది. అలీగఢ్ జిల్లా, విజయ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుర్రమ్పూర్ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఓమ్ ప్రకాశ్ శర్మ అనే రైతు 7 ఏళ్ల క్రితం స్థానికంగా కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమిలో ఓ మసీదుకు చెందిన టాయ్‌లెట్ ఉండటంతో అక్రమంగా నిర్మించారంటూ శర్మ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆ మరుగుదొడ్డిని తొలగించాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. దీంతో శనివారం ప్రకాశ్ మద్దతుదారులు.. మసీదు నిర్వాహకులు వివాదాస్పద స్థలానికి చేరుకుని వాదించుకున్నారు. ఆ సమయంలో కొందరు మరుగుదొడ్డిని కూల్చేందుకు యత్నించగా.. అది హింసాత్మకంగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆపేందుకు యత్నించిన స్థానికులను చితకబాదినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు యత్నించారు. అయితే పోలీసులను చూసి రెచ్చిపోయిన ఇరు వర్గాల వారు అక్కడ ఉన్న వాహనాలను తగలబెట్టారు. పరిస్థితి చేజారిపోయిందని భావించిన పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో హసీన్ అనే వ్యక్తి ప్రాణాలు వదిలినట్లు అధికారులు వెల్లడించారు. ఓమ్ ప్రకాశ్ శర్మతోపాటు గాయపడ్డ అతని సోదరులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘర్షణ అనంతరం ఉన్నతాధికారులు, పోలీస్ బెటాలియన్ ఆ ఊరికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. ఇక ఈ ఘర్షణ జరిగిన విధానాన్ని అలీగఢ్ జిల్లా కలెక్టర్ రిషికేష్ భాస్కర్ వివరించారు. కొంత కాలం క్రితమే ఇరు వర్గాల ఆ స్థల విషయంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయని ఆయన చెప్పారు. అల్లర్లపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన వివరించారు. ఇదిలా ఉంటే అవతలి వర్గం వాళ్లు మసీదును నాశనం చేశారని మైనార్టీ వర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘర్షణ లో మసీదు గోడను కూల్చేశారంటూ ఫిర్యాదు చేశారు. -
ఇద్దరి గొడవ.. రెండు ప్రాంతాలకు ఎగబాకి
దేవాస్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాస్త రెండు గ్రూపుల మధ్య ఘర్షణగా మారింది. రెండు భిన్న వర్గాలు తన్నుకున్నాయి. రోడ్ల మీదకు వచ్చి అలజడి సృష్టించాయి. దీంతో భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు వారిని చెల్లాచెదురు చేశారు. 50మందిని అదుపులోకి తీసుకున్నారు. కొత్వాలీ అనే ప్రాంతంలో ఓ మార్కెట్ వద్ద ఓ వ్యక్తి మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఆయుధాలతో వెళ్లి మరో కమ్యూనిటీపై దాడి చేశారు. దీంతో వారు వీరిపై తిరగబడ్డారు. అది కాస్త రెండు ప్రాంతాలకు ఎగబాకి పెద్ద స్థాయిలో ఘర్షణగా మారింది. మార్కెట్ ప్రాంగణమంతా తొక్కిసలాట చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో నరేంద్ర రాజోరియా రాజోరియా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రిలోకి తరలించే క్రమంలో ప్రాణాలుకోల్పోయాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు సంభవించగా పోలీసులు వచ్చి శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చి ప్రస్తుతానికి కర్ఫ్యూ విధించారు. -
అల్లర్లపై ఐదు కేసులు నమోదు
అత్తాపూర్, న్యూస్‌లైన్: సిక్ చావ్నీ అల్లర్ల ఘటనలో ఇరువర్గాలపై సైబరాబాద్ పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. మరోపక్క ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు అల్లర్లు విస్తరించకుండా.. ముఖ్యంగా పాతబస్తీలో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. శుక్రవారం ప్రార్ధనలు, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికారులు సిక్ చావ్నీపై ప్రత్యేక దృష్టి సారిం చారు. ప్రజల వెసులుబాటు కోసం గురువారం ఉదయం గంట పాటు కర్ఫ్యూను సడలించారు. ఈ సమయం లో ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ అత్యవసర పనులు చక్కబెట్టుకున్నారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కిషన్‌బాగ్ నుంచి ఎంఎం పహాడీ వరకు చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. కిషన్‌బాగ్, చింతల్మెట్, నందిముస్లాయిగూడ ప్రాంతాల నుంచి సిక్ చావ్నీ హర్షమహల్ వైపు వాహనాల రాకపోకలను నిషేధించారు. కాగా, కర్ఫ్యూ కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం సాహసించడంలేదు. జనం సంచారం లేకపోవడంతో రహదారులన్నీ ఖాళీగా కనిపిం చాయి. పోలీసులు ఎక్కడికక్కడ నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తుండటంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. ముందస్తు చర్యగా దక్షిణ మండల పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో శుక్రవారం 144 సెక్షన్‌ను విధించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆన ంద్, జాయింట్ పోలీసు కమిషనర్ గం గాధర్, శంషాబాద్, మాదాపూర్ డీసీపీ లు రమేష్‌నాయుడు, క్రాంతిరాణా టా టా బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. అల్లరి మూకల కోసం గాలింపు... అల్లర్లకు కారణమైన వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. చిన్న చిన్న ఆనవాళ్లను సైతం విడిచి పెట్టడంలేదు. రాళ్లు రువ్విన వారిని పోలీసులు వీడియో ఆధారంగా గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరువర్గాలకు చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రార్ధనలకు గట్టిబందోబస్తు... శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనల సందర్భంగా ఆయా ప్రాంతాలలో గట్టిబందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ కుశాల్కర్ తెలిపారు. ప్రార్ధనలు జరిగే హర్షమహల్, అత్తాపూర్ బడీమసీద్, చోటామసీద్, నౌనెంబర్, ఎంఎం పహాడీ, మహ్మదాబాద్, వాదియా మహ్మద్, చింతల్మెట్, జలాల్‌బాబానగర్, బాసిత్‌బాబానగర్ ప్రాంతాలలో పికెట్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే రాంబాగ్, చింతల్మెట్, నందిముస్లాయిగూడ ప్రాంతాలలోని ఆలయాల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతుందన్నారు. ఎక్కడైన అనుమానిత వ్యక్తులు కనిపించినా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. వెంటనే 100 నెంబర్‌కు సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ కుషాల్కర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ముజఫర్ నగర్ లో మళ్లీ మత ఘర్షణలు, ఉద్రిక్తత!
ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్ నగర్ లో మత ఘర్షణలు మళ్లీ ఉద్రిక్తతని పెంచాయి. బుధవారం రాత్రి మొదలైన ఘర్షణలు గురువారం నాటికి కూడా కొనసాగుతునే ఉన్నాయి. దాంతో ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని అధికారులు వెల్లడించారు. ఈ అల్లర్లలో 8 మందిని అరెస్ట్ చేశామని.. 15 కేసులు నమోదు చేశామని తెలిపారు. బుధవారం రాత్రి షామ్లీ జిల్లాలో ఫుగునాలో ఓ జంటపై కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. పోలీస్ అధికారులను దియో రాజ్ నగర్ కి పంపి... ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సెప్టెంబర్ 6 నుంచి 10 తేది వరకు మీరట్, షామ్లిలలో జరిగిన మత ఘర్షణల్లో 63 మంది మరణించగా, 43 వేల మంది నిరాశ్రయులయ్యారు.