ముజఫర్ నగర్ లో మళ్లీ మత ఘర్షణలు, ఉద్రిక్తత! | Tension in communal clash hit Muzaffarnagar | Sakshi
Sakshi News home page

ముజఫర్ నగర్ లో మళ్లీ మత ఘర్షణలు, ఉద్రిక్తత!

Published Thu, Oct 31 2013 10:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM

Tension in communal clash hit Muzaffarnagar

ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్ నగర్ లో మత ఘర్షణలు మళ్లీ ఉద్రిక్తతని పెంచాయి. బుధవారం రాత్రి మొదలైన ఘర్షణలు గురువారం నాటికి కూడా కొనసాగుతునే ఉన్నాయి. దాంతో ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని అధికారులు వెల్లడించారు. ఈ అల్లర్లలో 8 మందిని అరెస్ట్ చేశామని.. 15 కేసులు నమోదు చేశామని తెలిపారు. బుధవారం రాత్రి షామ్లీ జిల్లాలో ఫుగునాలో ఓ జంటపై కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. పోలీస్ అధికారులను దియో రాజ్ నగర్ కి పంపి... ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 
 
సెప్టెంబర్ 6 నుంచి 10 తేది వరకు మీరట్, షామ్లిలలో జరిగిన మత ఘర్షణల్లో 63 మంది మరణించగా, 43 వేల మంది నిరాశ్రయులయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement