దేవాస్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాస్త రెండు గ్రూపుల మధ్య ఘర్షణగా మారింది. రెండు భిన్న వర్గాలు తన్నుకున్నాయి. రోడ్ల మీదకు వచ్చి అలజడి సృష్టించాయి. దీంతో భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు వారిని చెల్లాచెదురు చేశారు. 50మందిని అదుపులోకి తీసుకున్నారు. కొత్వాలీ అనే ప్రాంతంలో ఓ మార్కెట్ వద్ద ఓ వ్యక్తి మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఆయుధాలతో వెళ్లి మరో కమ్యూనిటీపై దాడి చేశారు. దీంతో వారు వీరిపై తిరగబడ్డారు.
అది కాస్త రెండు ప్రాంతాలకు ఎగబాకి పెద్ద స్థాయిలో ఘర్షణగా మారింది. మార్కెట్ ప్రాంగణమంతా తొక్కిసలాట చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో నరేంద్ర రాజోరియా రాజోరియా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రిలోకి తరలించే క్రమంలో ప్రాణాలుకోల్పోయాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు సంభవించగా పోలీసులు వచ్చి శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చి ప్రస్తుతానికి కర్ఫ్యూ విధించారు.
ఇద్దరి గొడవ.. రెండు ప్రాంతాలకు ఎగబాకి
Published Sun, Jan 17 2016 5:10 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
Advertisement
Advertisement