రాజస్థాన్‌ను భారీ ఇసుక తుఫాన్ ముంచెత్తుతోంది. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఇసుక తుఫాన్ విరుచుకుపడింది. బికనీర్ జిల్లాలో ఇసుక తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. బీకనీర్ జిల్లా ఖజువాలా ప్రాంతంలో భారీ ఇసుకు తుఫాన్ చెలరేగుతుండటంతో అక్కడ పరిస్థితి భీతావహంగా ఉంది.