సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ప్రజలు భారీ వర్షాలు, పిడుగులు, ఇసుక తుపానులతో వణికిపోతుండగా, వాతావరణ విభాగం తాజా హెచ్చరికలను జారీ చేసింది రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు, పిడుగులు, ఉరుములతో కూడిన గాలివానలు, దుమ్ము ముంచెత్తనుందని ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండి) తెలిపింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాలులు, దుమ్ముతుఫాను సంభవించవచ్చని అంచనా వేసింది. బీహార్, జార్ఖండ్, ఒడిషా, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కోస్తా, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఉరుములతో కూడిన తుఫానులు, భారీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
భారత వాతావరణ విభాగం(ఐఎండి) తాజా హెచ్చరికల ప్రకారం, మే 10 (నేడు) ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, సిక్కింలను తీవ్రమైన వడగాలులు వణికించనున్నాయి. ఉరుములతో కూడిన తుఫాను రావచ్చు. 50-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. బీహార్, జార్ఖండ్, ఒడిషా, అసోం మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తర కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వీటితోపాటు విదర్భ, ఒడిశాలో కూడా అక్కడక్కడ అధిగ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి , కేరళ దక్షిణ ప్రదేశాలలో భారీ వర్షాలు కురుస్తాయి. మే 11, 12 తేదీల్లో ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తీరప్రాంత కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్నాటక, కేరళ రాష్ట్రాలలో వేడి గాలులతో పాటు ఉరుములతో కూడిన గాలి తుఫాను సంభవించవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 13న జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వేడిగాలులు, మే 14, సోమవారం పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రదేశాల్లో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని ఐఎండీ నివేదిక తెలిపింది.
ఇటీవల కాలంలో, తుఫానులు, భారీ వర్షాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రధానంగా ఉత్తర భారతదేశంలో పెను విధ్వంసం సృష్టించాయి. వంద మందికి పైగా మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. అలాగే జైపూర్, అజ్మీర్, జోధ్‌పూర్, బికనీర్లో దుమ్ము తుఫానులు సంభవించిన సంగతి తెలిసిందే. వాతావరణ విభాగం తాజా హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. దుమ్ము, తుఫాను ప్రభావాన్ని తగ్గించే అనేక జాగ్రత్తలపై దృష్టిట్టారు.
Comments
Please login to add a commentAdd a comment