జైపూర్ : ఈ వీడియో చూసిన వారికి ప్రళయం రాబోతుందా.. లేక వచ్చేసిందా అనే అనుమానం కలగక మానదు. అసలే ఫేక్ న్యూస్ ప్రచారం బాగా పెరిగిపోయింది కదా.. ఇది కూడా అలాంటి గ్రాఫిక్స్ జిమ్మిక్కే అన్పిస్తుంది. కానీ వాస్తవంగా జరిగిన సంఘటనకు దృశ్యరూపం ఇది. అది కూడా మన దేశంలో జరిగింది. వివరాలు.. మన దేశంలో రాజస్తాన్ రాష్ట్రం దుమ్ము, ఇసుక తుపానులకు పెట్టింది పేరు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఈ ఎడారి రాష్ట్రాన్ని ఓ భారీ దుమ్ము తుపాను చుట్టిముట్టింది. ఆ సందర్భంగా తీసిన వీడియో ఇది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఈ వీడియో తెగ వైరలవుతోంది.
చురు పట్టణం మీద దాడి చేయడానికి ఇంచుల మందంతో.. అంతెత్తున మేఘాలను తాకుతుందా అనిపించే భారీ దుమ్ము తుపాను వడివడిగా పరుగులు తీసుకుంటూ వచ్చింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన జనాలు.. ఆ వెంటనే తెరుకుని తన తమ సెల్‌ఫోన్‌లకు పని చెప్పారు. ఈ భయంకర దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు. అయితే ఈ తుపాను బీభత్సంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని.. పంట నష్టం మాత్రం జరిగిందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment