ఢిల్లీలో బీభ‌త్సం సృష్టించిన వ‌డ‌గండ్ల వాన | Heavy Rain In Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో బీభ‌త్సం సృష్టించిన వ‌డ‌గండ్ల వాన

Published Thu, May 14 2020 8:01 PM | Last Updated on Thu, May 14 2020 8:04 PM

Heavy Rain In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రం ఉన్నట్టుండి చల్లబడింది. ఆ త‌ర్వాత కొద్ది సేప‌టికే బ‌ల‌మైన ఈదురు గాలులు వీస్తూ వ‌ర్షం మొద‌లైంది. న‌గ‌రంలోని కొన్ని చోట్ల ఓ మోస్త‌రుగా మ‌రికొన్ని చోట్ల భారీగా వ‌ర్షం కురిసింది. ఘజియాబాద్, నౌయిడాలలో వడగండ్లు బీభ‌త్సం సృష్టించాయి. భారీ వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి, నగరవాసులను ఎండ వేడిమి నుంచి సేద దీర్చింది. అనేకమంది ట్విటర్, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ వాతావరణ వీడియోలను షేర్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement