Mumbai local train
-
భారీ వర్షాలు.. పసిబిడ్డను ఎత్తుకొని రైలు దిగిన తండ్రి, పట్టుతప్పడంతో
ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తోన్న కారణంగా కళ్యాణ్ - ఠాకుర్లి మధ్య ప్రయాణిస్తున్న లోకల్ రైలు వంతెన మీద నిలిపివేశారు. ఇదే సమయంలో నాలుగు నెలల పసికందును పట్టుకుని ఓ తండ్రి రైలు దిగారు. అక్కడే నిలబడి ఆడిస్తూ ఉండగా చేతులు పట్టుతప్పడంతో బిడ్డ వంతెన కింద కాలువలోకి జారిపోయింది. స్థానిక రైల్వే సిబ్బంది చాలాసేపు గాలింపు చర్యలు చేపట్టినా కాలువలో వరద ప్రవాహం వేగంగా ఉండటంతో ఫలితం లేకపోయింది. దేశవ్యాప్తంగా నైరుతి పవనాల ప్రభావంతో ఒక్కసారిగా వర్షాలు విరుచుకు పడుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిన అనేక ప్రాంతాలు వర్షాల ఉధృతికి జలమయం కాగా ముంబైలో కూడా వర్షాలు తారాస్థాయికి చేరాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ముంబై అతలాకుతలమైంది. అయినా కూడా జనం జీవనాన్ని యధాతధంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బుధవారం ముంబైలో ఘోరం జరిగిపోయింది. కళ్యాణ్ - ఠాకుర్లి మధ్య ప్రయాణిస్తోన్న లోకల్ రైలు భారీ వర్షం కారణంగా రెండు గంటల పాటు ఒక వంతెన మీద నిలిచిపోయింది. రైలులోని వారంతా రైలు ఎప్పుడు కదులుతుందా అని సుదీర్ఘంగా నిరీక్షిస్తూ ఉన్నారు.అంతలో ఓ పసిబిడ్డకు అసౌకర్యంగా ఉందనో ఏమో ఆ తండ్రి నాలుగు నెలల పసికందును ఆడించేందుకు రైలు దిగారు. పట్టాలు పక్కన అలా ఆడిస్తూ ఉండగా చేతులు పట్టుతప్పి బిడ్డ జారి కాలువలో పడిపోయింది. వెంటనే బిడ్డ తల్లి కిందకు దిగి.. కళ్ళ ముందు కాలువలో కొట్టుకుపోయిన బిడ్డ కోసం చేసిన ఆర్తనాదం చూపరుల హృదయాలను కలచివేసింది. Tragedy struck as a 4-month-old baby drowned in a nullah after slipping from his father's grasp. The parents had been stranded on a local train between Kalyan and Thakurli &while walking along the tracks, their little one slipped and fell into the nullah. Heartbreaking incident! pic.twitter.com/RAlN2lpPoU — Richa Pinto (@richapintoi) July 19, 2023 ఇది కూడా చదవండి: ఇకపై కుక్కలకు కూడా ఆధార్ కార్డు -
ఏం తెలివి సామీ.. క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన చేస్తున్న మోడ్రన్ బిక్షగాడు
మనం ప్రతిరోజూ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, దేవాలయాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిచ్చగాళ్లను చూస్తుంటాం. కొందరు తమకు తోచినంత సాయం చేస్తారు. ఇంకొందరేమో చిల్లర లేదని సింపుల్‌గా చెప్పి తప్పించుకుంటుంటారు. అయితే ఈ బిచ్చగాడి నుంచి మాత్రం మీరు అస్సలు తప్పించుకోలేరు. ఇందుకంటే ఇతను టెక్నాలజీని వాడుకుంటూ చేతిలో క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన చేస్తూ చాలా స్టైల్‌గా అడుక్కుంటున్నాడు. సాధరణంగా యచకులు పాత సంచి లేదా ఏదైనా చిన్న బొచ్చులాంటి పాత్ర పట్టుకొని అడ్డుకోవడం చూశాం. కానీ ఇది డిజిటల్ యుగం కదా. కాలం మారడంతో మనమూ మారాలి అనుకున్నాడేమో ఏకంగా ఇలా క్యూఆర్ కోడ్ ఇచ్చి మరీ దానం చేయమని అడుక్కుంటున్నాడు. ముంబైలోని ఓ రద్దీ లోకల్ ట్రైన్లో కనిపించింది ఈ దృశ్యం. చక్కగా పాటలు పాడుతూ స్టైల్లో క్యూఆర్ కోడ్ ఇచ్చి భిక్షాటన చేయడంతో అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టారు. ఓ వ్యక్తి ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ డిజిటల్ భిక్షగాడి తెలివికి నెటిజన్లు షాకవుతున్నారు. మరికొందరేమో ఇన్ని తెలివితేటలు ఉన్నవాడు సొంతంగా ఉద్యోగం చేస్తూ బతకొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. #MumbaiLocal #DigitalIndia That's Mumbai local where you can see the height of using digital payment A beggar is carrying the online payment sticker with him so you have not to bother about excuses of not having change its purely a cashless facility 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/HIxlRJkbmM — 💝🌹💖jaggirmRanbir💖🌹💝 (@jaggirm) June 25, 2023 -
ఇదెక్కడి గొడవరా బాబూ.. సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
ముంబై: మహిళల మధ్య జరిగే గొడవలు చాలా విచిత్రంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకుని చూస్తుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు. అచ్చం ఇలాగే ఓ చిన్న విషయంపై కొందరు మహిళలు గొడవ పడ్డారు. ముంబై లోక్‌ల్ ట్రైన్లో మహిళా ప్రయాణికులు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలోని థానే నుంచి పన్వేల్ వెళ్తున్న లోకల్ రైలు మహిళల కంపార్ట్మెంట్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ అధికారి శంభాజీ కటారే తెలిపిన వివరాల ప్రకారం.. తుర్భే స్టేషన్ వద్ద రైలు ఆగడంతో కొందరు మహిళలు ట్రైన్ ఎక్కారు. ట్రైన్లో ఒక్క సీటు మాత్రమే ఖాళీగా ఉండటంతో ఓ మహిళ అందులో కూర్చొని మరో మహిళకు కూడా సీట్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మూడో మహిళ వచ్చి ఆ సీటులో కూర్చుంది. దీంతో ఒక్క సీటు కోసం ముగ్గురు మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పెద్దపెద్దగా అరుస్తూ ఒకరిపైఒకరు చేయిచేసుకున్నారు. చదవండి: వామ్మో.. ఈ వాచ్ విలువ ఇన్ని కోట్లా? పోలీసులకు చిక్కడంతో..! అందరూ చూస్తుండగానే జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. మహిళలు గొడవ పడుతుండటంతో అక్కడున్న మిగతా ప్రయాణికులు దూరంగా వెళ్లియారు దీంతో కొద్దిసేపు ట్రైన్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కొట్లాటలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీరిని ఆపేందుకు ప్రయత్నించిన మహిళ అధికారికి సైతం గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వాషి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Fight between two female passengers over a seat in Mumbai Local Train. #MumbaiLocal #Fight #ViralVideo #Mumbai pic.twitter.com/A7GiedIUvJ — AH Siddiqui (@anwar0262) October 6, 2022 -
‘నాకేం వద్దు.. నాకు ఇలా బతకడమే బాగుంది’
వారం రోజులుగా ఈ ‘దాదీజీ’ (అవ్వ) వీడియో వైరల్ అవుతోంది. దానికి కారణం ముంబై మెట్రో రైళ్లల్లో ఈ దాదీజీ చాక్లెట్లు అమ్ముతూ కనిపించడమే. ఆమె కథ ఏమిటో. పిల్లలు చూస్తున్నారో లేదో. కాని తన జీవితం తాను బతకడానికి చక్కని నవ్వుతో తియ్యని చాక్లెట్లు అమ్ముతోంది. ఒక ప్రయాణికుడు ఆమె వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. చాలామంది సాయం చేస్తామని వచ్చారు. ‘చాక్లెట్లు కొనండి చాలు’ అని సున్నితంగా, ఆత్మగౌరవంతో తిరస్కరించిందామె. ముంబై లోకల్ ట్రైన్లలో చక్కగా నవ్వుతూ, చుడీదార్లో చలాకీగా నడుస్తూ, చాక్లెట్లు అమ్మే ఆ పెద్దావిడను చూసి ఎవరో వారం క్రితం సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వయసులో కూడా జీవించడానికి శ్రమ పడుతున్న ఆమెను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అయితే ఆ వీడియోను ట్వీట్ చేసి అందరూ ఆమె దగ్గర చాక్లెట్లు కొనండి అని వినతి చేశారు. ఆ తర్వాత ‘హేమ్‌కుంట్ ఫౌండేషన్’కు చెందిన అహ్లూవాలియా అనే వ్యక్తి ఆమెకు పెద్ద ఎత్తున సాయం చేస్తాము ఆమె ఎక్కడ ఉంటుందో గుర్తించండి అని ముంబై వాసులను ఉద్దేశించి ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను బాలీవుడ్ స్టార్లు కూడా రీట్వీట్ చేశారు. చాలామంది ముంబైవాసులు ‘మేము ఫలానా ట్రైన్లో చూశాం. ఆ స్టేషన్లో చూశాం’ అని స్పందనలు పెట్టారు. చివరకు వెతికి వెతికి ఆమెను పట్టుకున్నారు అహ్లూవాలియా మనుషులు. ఆమె పేరు వజ్జీ... ‘నా కుటుంబంలో సమస్య వచ్చింది. అప్పటినుంచి చాక్లెట్లు అమ్ముతున్నా’ అని ఆమె చెప్పింది వజ్జీ. ఫౌండేషన్ సభ్యులు ఆమెకు వెంటనే పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ‘నాకేం వద్దు. నాకు ఇలా బతకడమే బాగుంది’ అని చెప్పిందామె. ‘నా మనుషులు ఆమె చాక్లెట్లను రెట్టింపు రేటు ఇచ్చి కొందామన్నా ఆమె ఇవ్వలేదు. మామూలు రేటుకే ఇచ్చింది. ఇకపై ప్రతి వారం ఆమె చాక్లెట్లు మొత్తం మేము కొంటాం. ఎందుకంటే ఆ ఒక్క రోజు ఆమె అన్ని రైళ్లు తిరిగే అవస్థ తప్పుతుంది’ అని ట్వీట్ చేశాడు అహ్లూవాలియా. ‘ఆమె ఆత్మగౌరవం చూసి మేమందరం ఆమెకు మరింత అభిమానులం అయ్యాం’ అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఏవో సమస్యలు వస్తాయి. కాని వజ్జీలా నవ్వుతూ హుందాగా వాటిని ఎదుర్కొనడం తెలియాలి. వజ్జీ నుంచి గ్రహించాల్సిన పాఠం అదే. -
Viral: ఆ పసికందు ప్రేమకు అంతా ఫిదా
వైరల్: సోషల్ మీడియాలో రకాల రకాల కంటెంట్ వైరల్ అవుతుంటుంది. నెటిజన్లను ఆకట్టుకునేది కొంతే అయితే.. చిరాకు తెప్పించేది ఎంతో. కానీ, కొన్ని వీడియోలు మాత్రం భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. ఇంకొన్ని అస్లీ జిందగీని ప్రతిబింబించేలా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒకతను అలసిపోయినట్లు కనిపించడంతో, అతని కుమార్తె తన తండ్రికి అపారమైన ప్రేమతో పండ్లు తినిపించింది. పండు తిన్న తర్వాత తండ్రి తన కూతురిని ఆప్యాయంగా హత్తుకుంటాడు. అలా ఆ తండ్రీబిడ్డల ప్రేమ తాలుకా వీడియో హార్ట్ టచింగ్ వీడియోగా వైరల్ అవుతోంది. ప్రయాణాలు నిత్యం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. కొందరు ప్రయాణాలను సులువుగా మరిచిపోతారు.. మరికొందరికి మాత్రం ప్రయాణాలు మరిచిలేని గుర్తులను మిగులుస్తాయి. View this post on Instagram A post shared by Sakshi Mehrotra (@sankisakshi) అలా.. ప్రయాణంలో ఉన్న డిజిటల్ క్రియేటర్ సాక్షి మెహ్రోత్రాకు ఈ తండ్రీబిడ్డల మమకారపు క్షణాలు కంటపడేసరికి.. సంబురంగా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది. సంతోషానికి మించిన సంపద ఏముంటుంది? చెప్పండి. ముంబై లోకల్ ట్రైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రేమపై మీ కామెంట్‌ను తెలియజేయండి. -
ట్రైన్ జర్నీలో యువకుడి డేంజరస్ ఫీట్లు.. ఒళ్లు గగుర్పుడిచే దృశ్యాలు
ముంబై: యువత తమ నైపుణ్యాలను, సాహసాలను ప్రదర్శించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. సమయం చిక్కినప్పుడల్లా స్టంట్లు, విన్యాసాలు ప్రయత్నిస్తుంటారు. బైక్, కారు, రైల్లో ప్రయాణం చేసేటప్పుడు అస్సలు కుదురుగా ఉండరు. హద్దు మీరి సాహసాలు చేసి ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ క్రమంలో ముంబై లోకల్ రైలులో ఓ యువకుడు చేసిన విన్యాసాల వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వాస్తవానికి ఇది 2015లో చోటుచేసుకోగా తాజాగా ఓ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో ప్రమాదకరమని తెలిసినా కదులుతున్న రైలు డోర్ వద్ద తన స్నేహితులతో కలిసి నిలబడిన ఓ యువకుడు విన్యాసాలు చేశాడు. ముందుగా రైలు వెనక నుంచి పరుగెత్తకుంటూ వచ్చి రైలు ఎక్కాడు. తరువాత ట్రైన్ డోర్ హ్యాండిల్‌ను పట్టుకొని మరోవైపు ఊగుతూ కనిపిస్తున్నాడు. అంతటితో ఆగకుండా పదేపదే కిందకు మీదకు దూకడం, దారిలో వచ్చే స్తంభాలను తాకుతూ డేంజరస్ ఫీట్లు చేశాడు. మధ్యలో రైలు నుంచి దూకి గోడపై నడిచి మళ్లీ రైలులోకి రావడం చేశాడు. ఇదంతా తన స్నేహితులతో వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిని చూసిన నెటిజన్లు యువకుడి అజాగ్రతను చూసి షాక్‌కు గురవుతున్నారు. ఇలాంటి విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరమని, స్టంట్ ప్రయత్నాలు చేసే సమయంలో గాయలు, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చదవండి: షాకింగ్: ఇద్దరు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో ఏకంగా రూ. 900 కోట్లు జమ! వైరల్: బాబోయ్.. బైకుపై 13 మంది.. ఏంటీ వెర్రి పని! Wow #OMG #Madness #trains #Travel @ladbible @HldMyBeer @CrazyFunnyVidzz @Viralmemeguy #Lol #funny @LockerRoomLOL @YoufeckingIdiot @LovePower_page @DailyViralPro @DailyViralPro pic.twitter.com/Tl8nEY9xfn — Cazz inculo (@InculoCazz) September 14, 2021 -
మొదట శర్మ, తర్వాత పూజ, ఇప్పుడు రేఖ..
ముంబై లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్లో రోజూ రాకపోకలు సాగించే వారికి నత్య పరిచయస్తురాలైన ట్రాన్స్ఉమన్ పూజాశర్మ రేఖ దగ్గర ‘శుభములనివ్వుమమ్మ’ అంటూ దేశ విదేశాల్లోని వారు కూడా నేరుగానో, వీడియో కాల్లోనో దీవెనలు అందుకుంటూ ఉంటారు. నటి రేఖ పోలికలు, కవళికలు ఉంటాయని అంతా అంటుండే పూజ ఎక్కడివారు? మొదట శర్మ, తర్వాత పూజ, ఇప్పుడు రేఖ.. ఎలా అయ్యారు? మొదట మీరు చీరకట్టులో సినీనటి రేఖ ఎలా ఉంటారో ఊహకు తెచ్చుకోండి. ఒక్క కట్టే కాదు.. రేఖ బొట్టు, రేఖ ధరించే ఆభరణాలు, రేఖ నవ్వు, ఆ మాట తీరు, ఆ హుందాతనం అన్నీ కలిపి సృష్టికి పరిపూర్ణతలా ఎలాగైతే ఉంటాయో సరిగ్గా అలాగే ఉంటారు పూజాశర్మ. రేఖను తీసి రేఖను పెట్టినట్లుగా!! ఇంతకీ ఈ పూజ ఎవరంటే.. ముంబైలో ఉదయం పూట పట్టాల మీదకు వచ్చే లేడీస్ స్పెషల్ లోకల్ ట్రైన్ సెలబ్రిటీ. సోషల్ మీడియాలో లక్షా యాభై వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న ‘ఇన్ఫ్లుయెన్సర్’. ఇంత నిండైన మనిషిలోని మిగతా ప్రత్యేకతలన్నీ తెలుసుకున్నాక మాత్రమే ఆమె ట్రాన్స్ ఉమన్ అని చెప్పుకుండే చెప్పుకోవచ్చు పూజ ట్రైన్ డాన్స్ లోకల్ ట్రైన్లో పూజ డాన్స్ చేస్తారు. చక్కటి మాటల్తో మోటివేట్ చేస్తారు. అసలు ఆమెను చూడగానే నమస్కరించేవారు, నమస్కరించాలని అనిపిస్తుంది అనేవారు కూడా ఉన్నారు. ఆఫీసు వేళల కోసం నడిచే ఉమెన్ స్పెషల్ ట్రైన్ వెళ్లిపోయాక.. ప్లాట్‌ఫామ్ మీద పూజ ఒక్కరే నిలబడిపోతారు. ఆ తర్వాత ఆమె పండ్లే అమ్ముతారో, స్త్రీల లోదుస్తులు విక్రయించే దుకాణాలకు కాపలాదారుగా ఉంటారో, బంగారు ఆభరణాల షాపులో సహాయకారిలా ఉంటారో లేక వస్త్ర ఉత్పత్తుల కర్మాగారం ఆఫీస్ ప్యూన్‌గా వెళతారో, అపార్ట్మెంట్లకు ఇస్త్రీ బట్టలనే బట్వాడా చేస్తారో.. అది ఆమెకు దొరికిన పనిని బట్టి ఉంటుంది. ఆమె అనుదిన జీవనయానం ప్రారంభం అయ్యేది మాత్రం మహిళల లోకల్ ట్రెయిన్ ఫస్ట్ ట్రిప్‌లోనే. అది ఆమెకు మనోల్లాసాన్ని మాత్రమే కాదు, గుర్తింపునూ ఇస్తుంది. యాచన ఉండదు. ఇస్తే వద్దనీ అనరు. ఇచ్చేవారు గౌరవం కొద్దీ ఇస్తే, వారి గౌరవం కొద్దీ వద్దనకుండా తీసుకుంటారు పూజ. ‘రేఖలా ఉన్నావు’ అని అందరూ అంటుంటే తనూ రేఖలా రూపాంతరం చెందుతూ వచ్చిన పూజ ముంబై అమ్మాయి కాదు. కలకత్తా నుంచి ముంబై వచ్చిన అమ్మాయి. అమ్మాయి కూడా కాదు. అబ్బాయి. ఆ అబ్బాయి పేరే శర్మ. ఇప్పుడు ముంబైలో చేస్తున్న పనులనే ఆమె కలకత్తా లోనూ చేసేవారు. పురుషుడి దేహాన్ని కలిగి ఉన్న తన స్త్రీ మనసును గేలి చేయడం తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి ముంబై వచ్చారు. ముంబై ఆమెను ఆదరించింది. పూజ అందమైన స్వభావం వల్ల, ముంబైకి గ్లామర్ సెన్స్ ఎక్కువ కనుకా బహుశా ఆమెకు ఆదరణ లభించి ఉండాలి. అసలైతే ఆమె డాన్సర్ కాదు. ముంబై లో అంతా తన రూపలావణ్యాలను చూసి రేఖ అనడంతో, రేఖ అవడం కోసం ఆమె డాన్స్ ప్రాక్టీస్ చేశారు. వచ్చే కాస్త డబ్బుతోనే మోడర్న్ డ్రెస్‌లు వేసుకున్నారు. మంచి చీరలను కొనుక్కున్నారు. ముంబైలోని ఒక జాతీయ దినపత్రిక జర్నలిస్టు.. ఇంటర్వ్యూ కు ఆమెను ఒప్పించేందుకు ఆమెతో మాటలు కలుపుతూ ఉన్నప్పుడు అతడితోపాటు వచ్చిన ఫొటోగ్రాఫర్ ఆమెకు తెలియకుండా ఫొటో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె గురించిన వివరాలను ఇవ్వడంతో ఒక్కరోజులో పూజ సెలబ్రిటీ అయ్యారు. చాలాకాలం కిందటి సంగతి అది. మార్చి 8 న మహిళా దినోత్సవం రోజు ‘రేఖ’ అనే పేరున ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు వేల ప్రశంసలు వచ్చాయి. ముంబై ఆమెను పూర్తి మహిళగా స్వీకరించింది. రేఖలా పూజా! తర్వాతి నుంచీ పూజే తన వీడియోలను అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు. బిడ్డల్ని ఎత్తుకుని వచ్చి ఆమె ఆశీస్సులను కోరుతున్న తల్లులు, ప్రారంభోత్సవాలకు ఆమెను ఆహ్వానిస్తున్న వ్యాపారాల యజమానులు, పరీక్షలకు వెళ్లే ముందు బ్లెస్ చేయమని వచ్చి అడిగే విద్యార్థులు, ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులు.. వీళ్లంతా ఉన్న వీడియోలను చూసి విదేశాల నుంచి కూడా ఆమె దీవెనల కోసం అభ్యర్థనలు రావడం మొదలైంది! ఆ సమయంలో కనుక పూజ ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటే.. తన సెల్ఫోన్లోనే వారిని, వారిని పిల్లల్ని దీవించినట్లుగా వారి తలపై చెయ్యి ఉంచుతారు. మరి ఆమెను దేవుడు గానీ, మరెవరు గానీ దీవించలేకపోయారా! ‘‘మనుషులంతా మంచివాళ్లు. దేవుడు శక్తిమంతుడు. ఆ మంచితనం, ఆ శక్తి నన్ను నడిపిస్తున్నాయి. దేనికీ లోటు లేకుండా జీవిస్తున్నాను’’ అంటారు. పేరుకు మాత్రమే ఆమె పూజ కాదు. నిత్యం దైవారాధన చేస్తారు. ఆ తర్వాత ఆమె పొందే శక్తితో ఆమె ప్రయాణించే రైలు నడుస్తూ ఉన్నట్లుగా ఉంటుంది! మనసు లోపల ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఒత్తిళ్లతో ప్రయాణిస్తుండే మహిళల్ని ఆ కొద్దిసేపూ పూజ పలకరింపు, పూజ అభినయం సేద తీరుస్తాయి. ‘అసలు ఆమెను చూడగానే మనసుకు ఎక్కడ లేని సత్తువ వచ్చేస్తుంది’ అనేవారూ ఉన్నారు. పూజ పోస్ట్ చేసిన ఒక వీడియోను చూసి.. ‘‘పూజా.. నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. బాహ్యంగా, అంతర్లీనంగా కూడా’’ అని ప్రముఖ టీవీ నటి అంకితా లొఖాండే ఇటీవల కామెంట్ పెట్టడం పూజను ఎంతగానో సంతోషపరచిందట. ‘నువ్వు బాగున్నావు’. ‘నువ్వు చేసిన పని బాగుంది’ అనే మాటలు బతుకులోని చేదును తగ్గిస్తాయని పూజ అంటారు. ఆమె బాల్యం ఒక చేదు జ్ఞాపకం. ఆమె వర్తమానం ఆ చేదును మరిపిస్తున్న తియ్యదనం. ఇక్కడ చదవండి: పాలు పోయడానికి వచ్చా.. ఓట్లివ్వండి తన కల కోసం కూలీగా మారింది! -
అమ్మా! నీకు దండమే.. రైలమ్మా! నీకు దండమే!
మహానగరాల్లో ప్రభుత్వ బస్సులు, లోకల్ ట్రైన్లు సామాన్య జనానికి జీవనాడిలాంటివి. కరోనా దెబ్బతో లోకల్ట్రైన్లు రద్దు కావడంతో ముంబైలోని జనాలు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. పదకొండు నెలల తరువాత లోకల్ ట్రైన్ సర్వీసులను పునరుద్ధరించడంతో వీటిని నమ్ముకొని ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న జనాల ఆనందం ఆకాశాన్ని తాకింది. ఒక యువకుడు లోకల్ ట్రైన్ ఎక్కే ముందు తలవంచి భక్తిపారవశ్యంతో నమస్కరిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ‘సామాన్య జనం సెంటిమెంట్‌ను అందంగా క్యాప్చర్ చేసిన చిత్రం ఇది’ ‘ఈ ఫొటో గొప్పదనం ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణం చేసేవారికి బాగా తెలుస్తుంది’... ఇలా రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. -
‘బసంతిని వేలం వేశారు..’
ముంబై : సాధరణంగా టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఏం చేస్తారు.. జరిమానా విధిస్తారు. ఒక వేళ జరిమానా కట్టలేక పోతే టీసీ కాళ్లావేళ్లా పడి, బతిమిలాడి బయటపడతాం. కానీ ముంబై రైల్వే అధికారులు మాత్రం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికురాలికి జరిమానా విధించారు. కానీ ఫైన్ చెల్లించలేక పోవడంతో ఆ ప్రయాణికురాల్ని వేలం వేశారు. ఎంత దారుణం.. ఫైన్ చెల్లించలేదని వేలం వేస్తారా అంటూ రైల్వే అధికారులపై ఆగ్రహించకండి. ఎందుకంటే రైల్వే అధికారులు వేలం వేసిన ప్రయాణికురాలు మనిషి కాదు ‘మేక’. వినడానికి కాస్తా విచిత్రంగా అనిపిస్తున్న ఈ సంఘటన బుధవారం సాయంత్రం ముంబై రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం రైల్వే నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రయాణికుడు మేకతో కలిసి ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. అది గమనించిన టీసీ అతన్ని జంతువులతో కలిసి ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధం.. ముందు టికెట్ చూపించమని అడిగాడు. సదరు ప్రయాణికుడు నిబంధనలను అతిక్రమించడమే కాక అతను టికెట్ కూడా కొనలేదు. దాంతో టీసీ అతనికి ఫైన్ విధించాడు. జరిమానా చెల్లించడానికి తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. కానీ టీసీ ఫైన్ కట్టాల్సిందేనని చెప్పడంతో.. సరే నా మేకను మీ దగ్గర ఉండనివ్వండి. నేను వెళ్లి డబ్బులు తీసుకోస్తాను అని కోరాడు. చేసేదేంలేక టీసీ మేకను పట్టుకుని నిల్చున్నాడు. డబ్బులు తీసుకోస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకూ తిరిగిరాలేదు. దాంతో ఆ మేకను స్టేషన్లోనే కట్టేసి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అంతేకాక ఆ మేకకు ‘బసంతి’ అనే పేరు కూడా పెట్టారు. కానీ ఇలా ఎన్ని రోజులు..? అందుకే చివరకూ మేకను వేలం వేయడానికి నిర్ణయించారు. ‘బసంతి’ ఖరీదును మూడు వేల రూపాయలుగా నిర్ణయించారు. అయితే మరో ఆసక్తికర అంశం ఏంటంటే మేకను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో మరో 500 రూపాయలు తగ్గించి వేలం వేశారు. ఓ వ్యక్తి 2500 రూపాయలను చెల్లించి ‘బసంతి’ని తన సొంతం చేసుకున్నాడు. ముంబై లోకల్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తే రూ. 256 జరిమానా విధిస్తారు. కానీ బసంతిని వేలం వేయడం ద్వారా 10 రెట్లు అధికంగా రైల్వేకు లాభం రావడం విశేషం. -
గార్డ్ ఎదుటే ట్రెయిన్లో మహిళపై వేధింపులు
ముంబై : దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటనలు తరచూ వెలుగు చూస్తుండగా.. భారత ఆర్థిక రాజధాని ముంబైలోనూ మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ముంబైలో దాదర్-కుర్లా లోకల్ ట్రెయిన్లో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన ఈ విషయాన్ని మరోసారి తేటతెల్లం చేసింది. దివ్యాంగులకు కేటాయించిన కంపార్ట్మెంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు తోటి ప్రయాణికురాలి పట్ల లైంగిక వేదింపులకు దిగాడు. అక్కడున్న వారంతా దివ్యాంగులు కావడంతో ఎవరూ అతన్ని అడ్డుకోలేకపోయారు. ఇంత జరుగుతున్నా పక్కనే లేడిస్ కంపార్ట్మెంట్లో ఉన్న సెక్యురిటీ గార్ఢు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆగంతకుడు సదరు మహిళలను శారీరకంగా వేదిస్తున్న దురాగతాన్ని పాక్షిక అంధుడైన సహ ప్రయాణికుడు వీడియో తీశాడు. అదిప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ప్రమాదంలో పడేదే..! ఆ కామాంధుడిని తీవ్రంగా ప్రతిఘటించే క్రమంలో ఆమె ఒక సందర్భంలో ట్రెయిన్ డోర్ దగ్గరకు వెళ్లింది. కొంచెమైతే ఆమె ప్రమాదానికి గురయ్యేదే. అయితే చాకచక్యంగా వ్యవహరించి ఆమె ధైర్యంగా అతనికి ఎదురు తిరగడంతో ప్రమాదం తప్పింది. తోటివారి సహాయంతో అతన్ని రైల్వే పోలీసులకు అప్పగించింది. ఎంతచెప్పినా వినిపించుకోలేదు.. ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. ‘కుర్లాలో రైలు బయలుదేరగానే సదరు మహిళపై దుండగుడి దాడి మొదలైంది. నేను అక్కడే లేడిస్ కంపార్ట్మెంట్లో ఉన్న గార్డుకి ఎమర్జెన్సీ అలారం లాగమని చెప్పాను. కానీ అతడు పట్టించుకోలేదు. నాకు కళ్లు సరిగా కనిపించవు. నేను వాడిని అడ్డుకోవడానికిపోతే నా ప్రాణాలకు ప్రమాదం అని మిన్నకుండిపోయాను’ అని సమీర్ జావెరీ చెప్పాడు. -
మహిళకు గుండెపోటు వచ్చినా.. రైలు ఆగలేదు!
లోకల్ రైల్లో వెళ్తున్నప్పుడు మీ గుండె ఆగిపోయినా.. ఆ రైలు మాత్రం ఆగదు! అవును.. ముంబైలో సరిగ్గా ఇలాగే జరిగింది. 71 ఏళ్ల వయసున్న మహిళ చర్చిగేట్ స్టేషన్‌కు వెళ్లే లోకల్ రైలు ఎక్కారు. ఆమెకు గుండెపోటు వచ్చి దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది. కానీ రైలును ఆపేందుకు ఉండే చైన్లు ఆ సమయానికి పనిచేయలేదు. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో తోటి ప్రయాణికులు ధైర్యం చేసి కదులుతున్న రైల్లోంచి ఆమెను బయటకు లాగి అత్యవసరంగా వైద్య సేవలు అందేలా చూశారు. కమలేష్ బెహల్ (71) చాలాకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఒకసారి ఆమెకు గుండెపోటు వచ్చింది. ముంబై లోకల్ రైల్లో మహిళల ఫస్ట్ క్లాస్ కోచ్‌లో ప్రయాణం చేస్తుండగా.. ఆమెకు మరోసారి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించకపోతే దాదాపు ప్రాణాలు పోయేవి. ఆ విషయాన్ని అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న మరో మహిళ గమనించారు. రైలు ఆపేందుకు చైన్ లాగినా రైలు మాత్రం ఆగలేదు. బోగీలో ఉన్న ఏ చైనూ పనిచేయలేదు. రైలు స్టేషన్ వద్దకు సమీపిస్తుండగా కొంత స్లో అయింది. వెంటనే ఆ పక్కనున్న మహిళలు ఆమెను బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. దాంతో ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. -
రైలు ఢీకొట్టి నలుగురు చిందరవందరగా..
ముంబయి: నలుగురు కాంట్రాక్టు రైల్వే ఉద్యోగుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. విధుల్లో నిమగ్నమై ఉన్న నలుగురు రైల్వే గ్యాంగ్మెన్లను ఓ లోకల్ రైలు ఢీకొనడంతో వారు గాల్లోకి ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలోని సబర్బన్ కుర్లా- విద్యావిహార్ స్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సరిగ్గా ఉదయం 6.15గంటల నుంచి 6.30 గంటల మధ్య ప్రాంతంలో ఇది చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నలుగురు కాంట్రాక్టు రైల్వే గ్యాంగ్ మెన్ ఉద్యోగులు ఉదయాన్నే పనుల నిమిత్తం సబర్బన్ కుర్లా- విద్యావిహార్ స్టేషన్ల మధ్య పట్టాలపక్కన నడుస్తుండగా అనూహ్యంగా చత్రపతి శివాజీ టర్మనల్కు చెందిన లోకల్ రైలు వారిని వెనుకనుంచి వేగంగా ఢీకొట్టింది. కొంచెం చీకటిగా ఉండటం వల్ల రైలు రాకను గుర్తించపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు నవంబర్ 3, 2013లో కూడా నలుగురు గ్యాంగ్ మెన్లు ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. -
మద్యం మత్తులో మహిళ హంగామా
ముంబై: మద్యం మత్తులో ఓ మహిళ ముంబై లోకల్ రైలులో హంగామా సృష్టించింది. తాగిక మైకంలో ఒంటిపై బట్టలు లేకుండా ఉన్న ఆమెను జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె కారణంగా రైలు 15 నిమిషాలు ఆలస్యమయింది. థానే రైల్వేస్టషన్ లోని ప్లాట్ నంబర్ 4లో ఆమె లోకల్ రైలు ఎక్కింది. మద్యం మత్తులో పిచ్చిగా అరవడం మొదలు పెట్టింది. కొంతమంది ప్రయాణికులు అనారికంగా ప్రవర్తించి ఆమె ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఇద్దరు మహిళా జీఆర్పీ కానిస్టేబుల్స్ సాయంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆమె తన గురించి ఎటువంటి వివరాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెపై సెక్షన్ 43 కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. బాగా చదువుకుందని ఆమె మాటలను బట్టి తెలుస్తోందన్నారు. అయితే ఆమె తనకు తానుగా బట్టలు తొలగించుకుందా, ఎవరైనా ఈ పనికి పాల్పడ్డారా అనేది వెల్లడి కాలేదు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.