మద్యం మత్తులో మహిళ హంగామా | Naked drunk woman creates ruckus on Mumbai local train | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో మహిళ హంగామా

Published Wed, Nov 18 2015 2:04 PM | Last Updated on Tue, Oct 16 2018 8:34 PM

మద్యం మత్తులో మహిళ హంగామా - Sakshi

మద్యం మత్తులో మహిళ హంగామా

ముంబై: మద్యం మత్తులో ఓ మహిళ ముంబై లోకల్ రైలులో హంగామా సృష్టించింది. తాగిక మైకంలో ఒంటిపై బట్టలు లేకుండా ఉన్న ఆమెను జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె కారణంగా రైలు 15 నిమిషాలు ఆలస్యమయింది.

థానే రైల్వేస్టషన్ లోని ప్లాట్ నంబర్ 4లో ఆమె లోకల్ రైలు ఎక్కింది. మద్యం మత్తులో పిచ్చిగా అరవడం మొదలు పెట్టింది. కొంతమంది ప్రయాణికులు అనారికంగా ప్రవర్తించి ఆమె ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఇద్దరు మహిళా జీఆర్పీ కానిస్టేబుల్స్ సాయంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆమె తన గురించి ఎటువంటి వివరాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు.

బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెపై సెక్షన్ 43 కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. బాగా చదువుకుందని ఆమె మాటలను బట్టి తెలుస్తోందన్నారు. అయితే ఆమె తనకు తానుగా బట్టలు తొలగించుకుందా, ఎవరైనా ఈ పనికి పాల్పడ్డారా అనేది వెల్లడి కాలేదు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement