మహానగరాల్లో ప్రభుత్వ బస్సులు, లోకల్ ట్రైన్‌లు సామాన్య జనానికి జీవనాడిలాంటివి. కరోనా దెబ్బతో లోకల్‌ట్రైన్‌లు రద్దు కావడంతో ముంబైలోని జనాలు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. పదకొండు నెలల తరువాత లోకల్ ట్రైన్ సర్వీసులను పునరుద్ధరించడంతో వీటిని నమ్ముకొని ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న జనాల ఆనందం ఆకాశాన్ని తాకింది. ఒక యువకుడు లోకల్ ట్రైన్ ఎక్కే ముందు తలవంచి భక్తిపారవశ్యంతో నమస్కరిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ‘సామాన్య జనం సెంటిమెంట్‌ను అందంగా క్యాప్చర్ చేసిన చిత్రం ఇది’ ‘ఈ ఫొటో గొప్పదనం ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణం చేసేవారికి బాగా తెలుస్తుంది’... ఇలా రకరకాల కామెంట్‌లు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment