నీటమునిగి నగరం ఏడుస్తుంటే వీళ్లేమో..! | In Rain Affected Mumbai bizarre incident Took Place At Marine Drive | Sakshi
Sakshi News home page

నీటమునిగి నగరం ఏడుస్తుంటే వీళ్లేమో..!

Published Sun, Jun 10 2018 9:45 AM | Last Updated on Mon, Jul 23 2018 8:51 PM

In Rain Affected Mumbai bizarre incident Took Place At Marine Drive - Sakshi

ముంబై: రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి ముంబై నగరం అతలాకుతలం అవుతోంటే, అదేమీ పట్టనట్లు.. పట్టపగలు నడిరోడ్డుపై వికృతచేష్టలకు దిగిందో జంట. నిత్యం వేలాది మంది సేదతీరే మెరైన్‌ డ్రైవ్‌ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

భారీ వర్షం.. నలుగురి మృతి: శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు ముంబై మహానగరం, శివారులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం ఉదయం నాటికి వర్షపాతం సరాసరి 100 మిల్లీమీటర్లుగా నమోదయింది. దాదర్‌, పరేల్‌ టీటీ, ధారావి, కింగ్స్‌ సర్కిల్‌, కోలాబా, సియోన్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు నిలవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెట్టు విరిగి తలపై పడటంతో 13 ఏళ్ల బాలిక, గోడకూలి మరో ఇద్దరు దుర్మరణం చెందారు. భారీ వర్షానికి రోడ్డు కనిపించక లారీ డ్రైవర్‌ స్కూటీని ఢీకొట్టిన ఘటనలో మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. వర్షాభావ పరిస్థితిని చక్కదిద్దేందుకు బృహన్‌ ముంబై కార్పొరేషన్‌(బీఎంసీ), నేవీ, విపత్తు నిర్వహణ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యల్లో 3000పైచిలుకు మంది సిబ్బంది పాల్గొంటున్నారని బీఎంసీ కమిషనర్‌ అజొయ్‌ మెహతా తెలిపారు.

నడిరోడ్డుపై బరితెగింపు: ముంబైలో అత్యంత శోభాయమానంగా కనిపించే.. నిత్యం వేలమంది సేదతీరే మెరైన్‌ డ్రైవ్‌(క్వీన్స్‌ నెక్లెస్‌) రోడ్డుపై ఓ విదేశీయుడు, భారత మహిళ అసభ్యచర్యకు పాల్పడ్డారు. పట్టపగలు, రోడ్డుమీద వాహనాలు రద్దీని, వందలాది జనాన్ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయారు. (కింద వీడియో) ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైన వారిలో చాలా మంది సెల్‌ఫోన్లు తీసి వీడియోలు తీయగా, ఇంకొందరు పోలీసులకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే పోలీస్‌ మొబైల్‌ వ్యాన్‌ అక్కడికి చేరుకున్న ఖాకీలను చూసి జంట దుకాణం సర్దుకుని పారిపోయే ప్రయత్నం చేసింది..

కొనసాగుతోన్న వేట: పోలీసులు రోడ్డు దాటి వచ్చే లోపే సదరు విదేశీయుడు పారిపోయాడు. మహిళ మాత్రం దొరికిపోయింది. తనది గోవా అని, రోడ్డు మీద ముద్దు మాత్రమే పెట్టుకున్నామని పోలీసులతో ఆమె చెప్పింది. పదే పదే ఒంటిమీది దుస్తులను తీసేస్తూ మతిస్థిమితంలేని దానిలా ప్రవర్తించింది. డ్రగ్‌ అడిక్ట్‌ లేదా సైకోగా భావిస్తోన్న ఆమెను మహిళా సురక్ష కేంద్రానికి తరలించిన పోలీసులు.. వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక పరారైన విదేశీయుడు ఎవరనేది గుర్తించేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్‌ చేపట్టారు. మెరైన్‌ డ్రైవ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడంతోపాటు, దగ్గర్లోని హోటళ్లలో బసచేసిన విదేశీయుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి కేసు నమోదుచేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement