హీరో మేనేజర్ బెదిరించారు: కమెడియన్‌ | hero Manager Threatened To Beat Up Comedian | Sakshi
Sakshi News home page

హీరో మేనేజర్ బెదిరించారు: కమెడియన్‌

Published Thu, Aug 31 2017 5:30 PM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

హీరో మేనేజర్ బెదిరించారు: కమెడియన్‌

హీరో మేనేజర్ బెదిరించారు: కమెడియన్‌

సాక్షి, ముంబయి : దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం భారీ వర్షాలతో వణుకుతోండగా... సాధారణ పౌరులతో పాటు సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుండపోత వర్షాలతో ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కో విధంగా ఉంది. బాలీవుడ్ కమెడియన్ డానియెల్ ఫెర్నాండేజ్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. నటుడు సంజయ్ దత్ మేనేజర్ ఉన్న అపార్ట్ మెంట్ లోనే హాస్యనటుడు ఫెర్నాండేజ్ ఉంటున్నారు.

భారీ వర్షాల కారణంగా తన అపార్ట్ మెంట్లో కారు పార్కింగ్ కు అవకాశం లేకపోవడంతో సంజయ్ దత్ మేనేజర్ కు చెందిన స్థలంలో వాహనాన్ని ఉంచాలనుకున్నారు. ఆ విషయం చెప్పగానే హీరో మేనేజర్ ఆగ్రహంతో ఊగిపోయారని, కొట్టడానికి కూడా వెనుకాడనంటూ తనను హెచ్చరించారని కమెడియన్ ఫెర్నాండేజ్ వరుస ట్వీట్లు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఆఫీస్ ఉండగా అందుకోసం చాలా మొత్తంలో స్థలాన్ని హీరో మేనేజర్ వాడుకుంటున్నారని, కనీసం ఒక్కకారు పార్కింగ్ కు అనుమతించకపోగా తనపై దాడికి దిగారని ఆరోపించారు. తన బాధను ట్విట్టర్ ద్వారా ఫాలోయర్లతో కమెడియన్ షేర్ చేసుకున్నారు. దీంతో పలువురు హీరో మేనేజర్ చర్యను వ్యతిరేకిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement