ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబై, థానే పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి, వేడి నుంచి నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. కాగా ఈ నెల 13 వరకు ముంబైలో ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇలా డిసెంబర్‌లో అకాలవర్షం కురవడం పట్ల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలో వాన కురిసిన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో ఆకాశం మేఘావృతమైన, వర్షంతో తడిసిన వీధులను ఉద్దేశించి నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తూ, జోకులు పేలుస్తున్నారు. ఉదయం వర్షం పడటంతో, ఆ శబ్దం ఏంటో అర్ధం కాలేదని కొంతమంది చమత్కరించగా... మరికొంత మంది.. ‘‘ఇది శీతాకాలం. ఇది డిసెంబర్ అయినా వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఇది 2020. కాబట్టి ఏదైనా సాధ్యం’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది.. ‘‘వర్షం , చలి, వేడి, కరోనా , తుఫాన్ ఇవన్నీ కలిపి డిసెంబర్ నెలగా దేవుడు నిర్ణయించాడు’’ అని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఫొటోలు షేర్ చేస్తున్నారు.
ట్విటర్‌లో వైరల్ అవుతున్న మీమ్స్ :
Mumbaikars expecting Winter season but #MumbaiRains pic.twitter.com/gwILL52zNn
— Ȑ̫̰͍ͭa̤̩͊̌̑h͎̳̲̒ͫû̑͋̐́l̯̾ͩͣͭ (@Rahulismm) December 11, 2020
It's Winter
— Prathamesh Dinis (@pwdesque) December 11, 2020
Its December
Its Raining
But its 2020
So...#rains #MumbaiRains pic.twitter.com/EOVjxst6H3
*God deciding december*
— prayag sonar (@prayag_sonar) December 11, 2020
barish, thand, garmi, corona, light strom. #MumbaiRains pic.twitter.com/ItZYWL67s2
Bin Mausam Barsaat🌧🌧☔☔ #MumbaiRains 😶😶 pic.twitter.com/N1emmmrqz8
— Anand Kayralath (@kayralath) December 11, 2020
Comments
Please login to add a commentAdd a comment