
జీవీ కొత్త చిత్రం ప్రారంభం
యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ఎనకు ఇన్నోరు పేర్ ఇరుక్కు కుమారు చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం జీవీ బ్రూస్‌లీ, కడవుల్ ఇరుకురాన్ కుమారూ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా జీవీ హీరోగా మరో చిత్రం ఆదివారం చెన్నైలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఎంఎస్.శరవణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం ముత్తుసామి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో సత్యరాజ్, తంబిరామయ్య, రోబోశంకర్, అరుణ్‌రాజ్‌కుమార్, ఆర్‌జే.బ్లేడ్.శంకర్, ఆర్‌జే మిర్చి విజయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీనే సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి పీకే.వర్మ చాయాగ్రహణం అందిస్తున్నారు. దీనికి ఎం.సురేశ్‌రాజ్, అరుణ్ పురుషోత్తమన్, టి.రఘనాథన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూజా కార్యక్రమాలకు నటులు ప్రసన్న, శ్యామ్, రాంకీ, నిరోషా దంపతులు, దర్శకుడు విజయ్, నిర్మాత ఫైవ్‌స్టార్ కదిరేశన్, పలువురు సీనీ ప్రముఖులు హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.