పండగలా.. ప్రతిరోజూ పండగే | Sai Dharam Tej Prati Roju Pandage First Glimpse Released | Sakshi
Sakshi News home page

పండగలా.. ప్రతిరోజూ పండగే

Published Tue, Oct 15 2019 6:15 PM | Last Updated on Tue, Oct 15 2019 6:24 PM

Sai Dharam Tej Prati Roju Pandage First Glimpse Released - Sakshi

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌, రాశీఖన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం ప్రతిరోజూ పండగే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్ట్‌ర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా మంగళవారం  తేజ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లిమ్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కుటుంబ బంధాలు, విలువలను గుర్తు చేసేలా ఈ చిత్రం రూపొందినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో చూస్తే సత్యరాజ్, తేజ్‌ల మధ్య సన్నివేశాలు చాలా బాగా కుదిరినట్టుగా అనిపిస్తోంది. మంచి ఫీల్‌తో సాగిన ఈ ప్రమోషన్‌ వీడియో అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

కాగా, మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పత్రిరోజు పండగే యూనిట్‌ సాయిధరమ్‌ తేజ్‌ బర్త్‌డే వేడుకలను నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మారుతి తన ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement