పాడతారా? | Trivikram Srinivas and Anirud Ravichandran thought to sing a song with Pawankalyan | Sakshi
Sakshi News home page

పాడతారా?

Published Fri, Jul 14 2017 10:56 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పాడతారా? - Sakshi

పాడతారా?

పవన్‌కల్యాణ్‌ పాడతారా? లేదా? ప్రస్తుతానికి సస్పెన్స్‌! కానీ, పవన్‌తో ఒక్క పాట పాడించాలని దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్, సంగీత దర్శకుడు అనిరుద్‌ రవిచంద్రన్‌ల ఆలోచన. ఆల్రెడీ పవన్‌ దగ్గర ఈ ప్రపోజల్‌ పెట్టారు.

మరి, ఆయన ఏమంటారో? పవన్‌కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి అనిరుద్‌ స్వరకర్త. ఆల్రెడీ అన్ని ట్యూన్స్‌ని ఫైనలైజ్‌ చేసేశారట. అందులో ఓ పాటను పవన్‌ చేత పాడించాలనుకుంటున్నామని స్వయంగా అనిరుద్‌ పేర్కొన్నారు. ‘అత్తారింటికి దారేది’లో పవన్‌ పాడిన ‘కాటమరాయుడా... కదిరి నరసింహుడా’ పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. ఇంకోసారి పవన్‌ సింగర్‌గా తన గొంతు వినిపిస్తారా? వెయిట్‌ అండ్‌ సీ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement