అనిరుద్‌ గురించి విజయ్‌ దేవరకొండ వైరల్‌ కామెంట్స్‌ | Vijay Devarakonda Interesting Comments On Music Director Anirudh, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda On Anirudh: అనిరుద్‌ గురించి విజయ్‌ దేవరకొండ వైరల్‌ కామెంట్స్‌

Published Wed, Aug 23 2023 6:54 AM | Last Updated on Wed, Aug 23 2023 8:35 AM

Vijay Devarakonda Comments On Anirudh - Sakshi

రౌడీ హీరోగా ముద్ర వేసుకున్న నటుడు విజయ్‌ దేవరకొండ. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం ఖుషి. సమంత కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని వై రవిశంకర్‌ ఎలమంచిలి కలిసి నిర్మించారు. శివ నిర్వాణ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మురళి చాయాగ్రహణంను, హెశాన్‌ అబ్దుల్‌ మహబ్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో సెప్టెంబర్‌ ఒకటో తేదీ విడుదల కానుంది.

(ఇదీ చదవండి: రాజ‌కీయాల్లో చిరు ఓడిపోవ‌చ్చేమో కానీ సినిమాల్లో ఎప్పటికీ 'మగధీరుడే')

దీన్ని తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ద్వారా శ్రీ లక్ష్మీ మూవీస్‌ సంస్థ అధినేత ఎన్‌వీ ప్రసాద్‌, కేరళలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ ముఖేష్‌ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్‌ చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆర్‌బీ చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిర్మాత ఎంవీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. మైత్రి మూవీ మేకర్‌ సంస్థ నిర్మించిన చిత్రాలు 90 శాతం విజయం సాధించాయన్నారు. ఖుషి చిత్రానికి తమిళనాడులో మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. తాను ఇంతకుముందు నటించిన పెళ్లిచూపులు, అర్జున్‌ రెడ్డి, గీతగోవిందం చిత్రాల కాలం నుంచి తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఖుషీ చిత్రం కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. నటి సమంతతో కలిసి ఈ చిత్రంలో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌ అన్నారు.

తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఎందరో సూపర్‌ స్టార్స్‌ ఉన్నారని, అయితే జాతీయస్థాయిలో వెలిగిపోతున్న ఒకే ఒక్క సూపర్‌స్టార్‌ సంగీత దర్శకుడు అనిరుద్‌ అని పేర్కొన్నారు. ఆయన్ను కిడ్నాప్‌ చేసి తీసుకుపోవాలనిపిస్తోందన్నారు. అనిరుధ్‌ సంగీత దర్శకత్వంలో ఒక చిత్రం చేయాల్సిందని, అది మిస్‌ అయిందని, త్వరలోనే తాము కలిసి పనిచేస్తామని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్‌ సోషల్‌మీడియాలో భారీగా వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement