Kushi-2
-
విజయ్ దేవరకొండ, సమంతల ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ..!
-
కుషి బ్లాక్ బస్టర్ వేడుకల్లో నిర్మాత నవీన్ యెర్నేని..
-
అనిరుద్ గురించి విజయ్ దేవరకొండ వైరల్ కామెంట్స్
రౌడీ హీరోగా ముద్ర వేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం ఖుషి. సమంత కథానాయకిగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ ఎలమంచిలి కలిసి నిర్మించారు. శివ నిర్వాణ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మురళి చాయాగ్రహణంను, హెశాన్ అబ్దుల్ మహబ్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ ఒకటో తేదీ విడుదల కానుంది. (ఇదీ చదవండి: రాజకీయాల్లో చిరు ఓడిపోవచ్చేమో కానీ సినిమాల్లో ఎప్పటికీ 'మగధీరుడే') దీన్ని తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ అధినేత ఎన్వీ ప్రసాద్, కేరళలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ముఖేష్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఆర్బీ చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిర్మాత ఎంవీ ప్రసాద్ మాట్లాడుతూ.. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన చిత్రాలు 90 శాతం విజయం సాధించాయన్నారు. ఖుషి చిత్రానికి తమిళనాడులో మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తాను ఇంతకుముందు నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం చిత్రాల కాలం నుంచి తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఖుషీ చిత్రం కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. నటి సమంతతో కలిసి ఈ చిత్రంలో నటించడం మంచి ఎక్స్పీరియన్స్ అన్నారు. తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారని, అయితే జాతీయస్థాయిలో వెలిగిపోతున్న ఒకే ఒక్క సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ అని పేర్కొన్నారు. ఆయన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోవాలనిపిస్తోందన్నారు. అనిరుధ్ సంగీత దర్శకత్వంలో ఒక చిత్రం చేయాల్సిందని, అది మిస్ అయిందని, త్వరలోనే తాము కలిసి పనిచేస్తామని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. -
తన 'కొత్త ప్రేమ'ని వెల్లడించిన సమంత
సౌత్ ఇండియాలో ప్రముఖ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. విజయ్ దేవరకొండి-సమంత కలిసి నటించిన ప్రేమ కథాచిత్రం 'ఖుషి' సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందకు రానుంది. ప్రస్తుతం ఆమె మాయోసైటిస్ జబ్బుతో ఇబ్బంది పడుతుండటం వల్ల సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: 40 ఏళ్ల వయసులో పెళ్లిపై దృష్టి పెట్టిన త్రిష..) కానీ ఖుషి సినిమా ప్రమోషన్స్ కోసం కొన్ని రోజుల పాటు యాక్టివ్‌గా కనిపించింది. ఖుషి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు సమంత రాలేకపోయిన ఆడియో కార్యక్రమానికి హాజరై తన ప్రమోషన్స్‌ని సామ్ స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో సామ్, విజయ్ దేవరకొండతో కలిసి చేసిన డాన్స్ బాగా వైరల్ అయింది. దీంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఈ ఈవెంట్లో సమంత పాల్గొనడంతో ఖుషి వైబ్ మరింత పెరిగింది. 'కొత్త ప్రేమ'ని వెల్లడించిన సమంత ప్రస్తుతం సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్న సమంత తరచుగా సోషల్ మీడియాలో తన అభిమానులు, అనుచరులతో టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌తో ఆమె ఇంటరాక్ట్ అవుతోంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన లైఫ్ అప్డేట్లను తరచుగా పోస్ట్ చేసే సమంత తాజాగ తన 'కొత్త ప్రేమ' అనే పదంతో ప్రారంభించి ఒక పోస్ట్ చేసింది. అక్కడ ఒక గ్లాస్లో వాటర్ ఉన్న ఫోటోను షేర్ చేసింది. (ఇదీ చదవండి: తల్లితో కలిసి అమెరికాకు సమంత.. దాని కోసమేనా?) మెరిసే నీటి పట్ల కొత్త ప్రేమను కనుగొన్నా అంటూ కొత్త ఆంక్షలతో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి అని మూడు లవ్ ఎమోజీలను చేర్చి తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఫోటోలో ఆమె చేతికి లవ్ అనే అక్షరాలతో ఉన్న అందమైన బ్రాస్లైట్ను కూడా చూడవచ్చు. ఈ పోస్ట్‌ను బట్టి మాయోసైటిస్ నుంచి ఆమె త్వరగా కోలుకుంటుంది అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. స్వచ్ఛమైన నీరే ఆమెకు ప్రేమను పంచుతుందని కొందరంటుంటే... కొందరు మాత్రం ఆ పోస్ట్ వెనకున్న ప్రేమ ఏంటో అంటూ షేర్ చేస్తున్నారు. -
మీ గౌరవం ఏంటో తెలుసుకోండి.. అలా అయితే జీవించనక్కర్లేదు: సమంత
వాస్తవాలు తెలియకుండా ఎవరినీ విమర్శించడం మంచిది కాదు. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎవరికైనా ఆగ్రహం కలుగుతుంది. నటి సమంతకు అలానే కోపం వచ్చింది. మయోసైటీస్ జబ్బుతో బాధపడుతున్న సమంత షూటింగ్‌లను కూడా రద్దు చేసుకుని విదేశాల్లో వైద్య చికిత్స పొందేందుకు ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు: సినీ నటి) కాగా ఆమె నటుడు విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఖుషి చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని సమంతపై కొందరు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటివారికి బదిలిచ్చే విధంగా సమంత తన ట్విట్టర్లో ఘాట్‌గా ఒక ట్వీట్ ఇలా చేశారు.. (ఇదీ చదవండి: జీన్స్,జోడీ చిత్రాలతో మెప్పించిన ప్రశాంత్ లైఫ్‌లో ఎవరూ ఊహించని ఘటన) ‘మీరు ఈ ప్రపంచం కోసం జీవించాల్సిన అవసరం లేదు. మీ గౌరవాన్ని మీరు తెలుసు కోవాలి. మీ స్థాయిని మీరే పెంచుకోవాలి. మీ కోసం మీరు జీవించండి. ఇతరుల కోసం కాదు. మిమ్మల్ని ఈ సమాజం గుర్తించకపోవచ్చు. అయితే మీరు అలా ఉండకూడదు. పదిమందిలో ఒకరిగా కాకుండా మీ కోసం మీరు నిలబడటం అన్నది ఎప్పటికీ మంచిది’ అని పేర్కొన్నారు. ఆమె ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఖుషి చిత్రం సెప్టెంబర్ ఒకటవ తేదీన తెరపైకి రానుంది. దీంతో ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమాల్లో సమంత పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
బొద్దింకను చంపితే హీరో.. సీతాకోక చిలుకను చంపితే విలన్: సమంత
సౌత్ సినిమా ఇండస్ట్రీ స్టార్ నటి సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇస్తున్న సంగతి తెలిసిందే. మయోసిటిస్‌తో పోరాడుతున్న ఆమె ప్రస్తుతం తన ఆరోగ్యం కోలుకోవడంపై దృష్టి సారించింది. ఇటీవల కొత్త సినిమాలేవీ ప్రకటించలేదు. షూటింగ్లలో పాల్గొనడం లేదు. తాను అంగీకరించిన రెండు సినిమాల పనులను కూడా సామ్ ఇప్పటికే పూర్తి చేసింది. స్నేహితులతో సమంత విజయ్ దేవరకొండతో నటించిన ఖుషి సినిమా విడుదలకు దగ్గర్లో ఉంది. మరోవైపు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సిటాడెల్ సిరీస్‌లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఆమె ఇప్పటికే పూర్తి చేసుకుంది. సినిమా పనుల నుంచి కొంత విరామం తీసుకున్న సామ్, ప్రస్తుతం తన ప్రైవేట్ టైమ్‌ని ఎంజాయ్ చేస్తుంది. పవిత్ర పుణ్యక్షేత్రాలతో పాటు విదేశాల్లో తన స్నేహితులతో ఆనందంగా గడుపుతుంది. త్వరలో తన చికిత్స తీసుకునేందుకు అమెరికా కూడా వెళ్లనుంది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చెప్పిందంటే సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు ఫిలాసఫీ కోట్స్ కూడా ఆమె షేర్ చేస్తుంటుంది. ఆమెకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఇప్పుడు ఇలాంటి పోస్ట్‌ను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. 'బొద్దింకను చంపితే హీరో అవుతారు.. సీతాకోక చిలుకను చంపితే విలన్ అవుతారు. నైతికతకు కూడా సౌందర్య ప్రమాణాలు ఉన్నాయి.' అంటూ సమంత రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఇలాంటి అభిప్రాయం ఇప్పుడెందుకు వచ్చిందని సమంతకు ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే విజయ్- సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
కేరళకు వెళ్లిన సమంత, విజయ్ దేవరకొండ... కారణమిదే
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా లేటెస్ట షెడ్యూల్ కేరళలో ప్రారంభం కానుంది. ఇప్పటికే సామ్, విజయ్ అక్కడకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను కూడా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వారం పాటు సాగే ఈ షెడ్యూల్లో విజయ్, సమంతలపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేసిందట చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాను సెప్టెంబర్1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
విజయ్, సమంతల 'ఖుషీ' మూవీపై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సమంత అనారోగ్యం కారణంగా ఇప్పటివరకు షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు సామ్ కోలుకోవడంతో త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది రెండు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి సమ్మర్లో ఖుషీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. తాజాగా ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ శివ నిర్వాణ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. .యాక్షన్ సీక్వెన్స్ తో ఖుషి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది అంటూ పాపులర్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్, ఎడిటర్ ప్రవీణ్ పూడితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఫిల్మ్‌సర్కిల్స్‌లో అందుతున్న సమాచారం ప్రకారం.. ఈనెల 8 నుంచి ఖుషీ కొత్త షెడ్యూల్ షురూ కానున్నట్లు తెలుస్తుంది. Heading towards next schedules #Kushi Action mode on🔥 With ace stunt master @PeterHeinOffl and my editor @PrawinPudi pic.twitter.com/nVkma5QyaJ — Shiva Nirvana (@ShivaNirvana) March 5, 2023 -
ఖుషీ మూవీ సెట్స్‌లో పాల్గొననున్న సమంత
సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ నుంచి కోలుకున్న ఆమె ఇప్పుడు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటీడెల్ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. భారీ యాక్షన్ సీక్వెన్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం సమంత శిక్షణ తీసుకుంటుంది. శరవేగంగా జరుగుతున్న ఈ సిరీస్ షూటింగ్లో యాక్షన్ సీన్స్ చేస్తూ సమంత గాయాలపాలైన సంగతి తెలిసిందే. దీంతో కాస్త బ్రేక్ ఇచ్చిన సామ్ త్వరలోనే విజయ్ దేవరకొండ సరసన ఖుషీ మూవీ సెట్స్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చాలా రోజుల పాటు ఖుషీ షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో త్వరలోనే మార్చి 8నుంచి ఖుషీ సినిమా షూటింగ్ రీస్టార్ట్ కానుండగా సమంత కూడా షూటింగ్లో పాల్గొననుంది. సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి జూన్ కల్లా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
కృతిశెట్టి కు తలుపు తట్టిన గుడ్ న్యూస్
-
పవన్‌తో మరోసారి?
పవన్ కల్యాణ్‌తో అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరిన నాయికల్లో సమంత ఒకరు. ‘అత్తారింటికి దారేది’లో ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది. మరోసారి ఈ ఇద్దరూ జతకట్టనున్నారన్నది చెన్నై టాక్. పవన్ కల్యాణ్ నటించిన చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే వాటిలో ‘ఖుషీ’ ఒకటి. ఈ చిత్రదర్శకుడు ఎస్.జె. సూర్య దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇందులో సమంతను నాయికగా తీసుకోవాలను కుంటున్నారట.