Samantha Drops Picture of Her ‘New Found Love’ Amid Myositis Treatment - Sakshi
Sakshi News home page

తన 'కొత్త ప్రేమ'ని వెల్లడించిన సమంత

Aug 20 2023 7:54 AM | Updated on Aug 20 2023 12:16 PM

Samantha Reveals Her New Found Love - Sakshi

సౌత్‌ ఇండియాలో ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరిగా కొనసాగుతున్నారు. విజయ్‌ దేవరకొండి-సమంత కలిసి నటించిన ప్రేమ కథాచిత్రం 'ఖుషి' సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందకు రానుంది. ప్రస్తుతం ఆమె మాయోసైటిస్ జబ్బుతో ఇబ్బంది పడుతుండటం వల్ల సినిమాలకి కొంత గ్యాప్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: 40 ఏళ్ల వయసులో పెళ్లిపై దృష్టి పెట్టిన త్రిష..)

కానీ ఖుషి సినిమా ప్రమోషన్స్ కోసం కొన్ని రోజుల పాటు యాక్టివ్‌గా కనిపించింది. ఖుషి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు సమంత రాలేకపోయిన ఆడియో కార్యక్రమానికి హాజరై తన ప్రమోషన్స్‌ని సామ్ స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో సామ్, విజయ్ దేవరకొండతో కలిసి చేసిన డాన్స్ బాగా వైరల్‌ అయింది. దీంతో సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ ఈవెంట్‌లో సమంత పాల్గొనడంతో ఖుషి వైబ్ మరింత పెరిగింది.

'కొత్త ప్రేమ'ని వెల్లడించిన సమంత
ప్రస్తుతం సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్న సమంత తరచుగా సోషల్ మీడియాలో తన అభిమానులు, అనుచరులతో టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌తో ఆమె ఇంటరాక్ట్ అవుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన లైఫ్ అప్‌డేట్‌లను తరచుగా పోస్ట్ చేసే సమంత తాజాగ తన 'కొత్త ప్రేమ' అనే పదంతో ప్రారంభించి ఒక పోస్ట్‌ చేసింది. అక్కడ ఒక గ్లాస్‌లో వాటర్‌ ఉన్న ఫోటోను షేర్‌ చేసింది.

(ఇదీ చదవండి: తల్లితో కలిసి అమెరికాకు సమంత.. దాని కోసమేనా?)

మెరిసే నీటి పట్ల కొత్త ప్రేమను కనుగొన్నా అంటూ కొత్త ఆంక్షలతో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి అని మూడు లవ్‌ ఎమోజీలను చేర్చి తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఫోటోలో ఆమె చేతికి లవ్‌ అనే అక్షరాలతో ఉన్న అందమైన బ్రాస్‌లైట్‌ను కూడా చూడవచ్చు. ఈ పోస్ట్‌ను బట్టి మాయోసైటిస్ నుంచి ఆమె త్వరగా కోలుకుంటుంది అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. స్వచ్ఛమైన నీరే ఆమెకు ప్రేమను పంచుతుందని కొందరంటుంటే... కొందరు మాత్రం ఆ పోస్ట్‌ వెనకున్న ప్రేమ ఏంటో అంటూ షేర్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement