మీ గౌరవం ఏంటో తెలుసుకోండి.. అలా అయితే జీవించనక్కర్లేదు: సమంత | Samantha Comments On Netizens | Sakshi
Sakshi News home page

Samantha: మీ స్థాయిని తగ్గించుకోకండి: సమంత

Published Mon, Aug 14 2023 6:46 AM | Last Updated on Mon, Aug 14 2023 6:57 AM

Samantha Comments On Netizens - Sakshi

వాస్తవాలు తెలియకుండా ఎవరినీ విమర్శించడం మంచిది కాదు. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎవరికైనా ఆగ్రహం కలుగుతుంది. నటి సమంతకు అలానే కోపం వచ్చింది. మయోసైటీస్‌ జబ్బుతో బాధపడుతున్న సమంత షూటింగ్‌లను కూడా రద్దు చేసుకుని విదేశాల్లో వైద్య చికిత్స పొందేందుకు ప్లాన్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు: సినీ నటి)

కాగా ఆమె నటుడు విజయ్‌ దేవరకొండకు జంటగా నటించిన ఖుషి చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని సమంతపై కొందరు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటివారికి బదిలిచ్చే విధంగా సమంత తన ట్విట్టర్లో ఘాట్‌గా ఒక ట్వీట్‌ ఇలా చేశారు..

(ఇదీ చదవండి: జీన్స్‌,జోడీ చిత్రాలతో మెప్పించిన ప్రశాంత్‌ లైఫ్‌లో ఎవరూ ఊహించని ఘటన)

‘మీరు ఈ ప్రపంచం కోసం జీవించాల్సిన అవసరం లేదు. మీ గౌరవాన్ని మీరు తెలుసు కోవాలి. మీ స్థాయిని మీరే పెంచుకోవాలి. మీ కోసం మీరు జీవించండి. ఇతరుల కోసం కాదు. మిమ్మల్ని ఈ సమాజం గుర్తించకపోవచ్చు. అయితే మీరు అలా ఉండకూడదు. పదిమందిలో ఒకరిగా కాకుండా మీ కోసం మీరు నిలబడటం అన్నది ఎప్పటికీ మంచిది’ అని పేర్కొన్నారు. ఆమె ట్వీట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా ఖుషి చిత్రం సెప్టెంబర్‌ ఒకటవ తేదీన తెరపైకి రానుంది. దీంతో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ కార్యక్రమాల్లో సమంత పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement