Samantha Wrote Interesting Story on Instagram Over Morality - Sakshi
Sakshi News home page

Samantha: బొద్దింకను చంపితే హీరో.. సీతాకోక చిలుకను చంపితే విలన్: సమంత

Published Sun, Aug 13 2023 12:52 PM | Last Updated on Sun, Aug 13 2023 1:09 PM

Samantha Viral Comments In Instagram - Sakshi

సౌత్ సినిమా ఇండస్ట్రీ స్టార్ నటి సమంత  ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇస్తున్న సంగతి తెలిసిందే. మయోసిటిస్‌తో పోరాడుతున్న ఆమె ప్రస్తుతం తన ఆరోగ్యం కోలుకోవడంపై దృష్టి సారించింది. ఇటీవల కొత్త సినిమాలేవీ ప్రకటించలేదు. షూటింగ్‌లలో పాల్గొనడం లేదు. తాను అంగీకరించిన రెండు సినిమాల పనులను కూడా సామ్ ఇప్పటికే  పూర్తి చేసింది.

స్నేహితులతో సమంత  
విజయ్ దేవరకొండతో నటించిన ఖుషి సినిమా విడుదలకు దగ్గర్లో ఉంది. మరోవైపు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సిటాడెల్ సిరీస్‌లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఆమె ఇప్పటికే పూర్తి చేసుకుంది. సినిమా పనుల నుంచి కొంత విరామం తీసుకున్న సామ్, ప్రస్తుతం తన ప్రైవేట్ టైమ్‌ని ఎంజాయ్ చేస్తుంది. పవిత్ర పుణ్యక్షేత్రాలతో పాటు విదేశాల్లో తన స్నేహితులతో ఆనందంగా గడుపుతుంది. త్వరలో తన చికిత్స తీసుకునేందుకు అమెరికా కూడా వెళ్లనుంది.

సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చెప్పిందంటే
సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు ఫిలాసఫీ కోట్స్ కూడా ఆమె షేర్‌ చేస్తుంటుంది. ఆమెకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఇప్పుడు ఇలాంటి పోస్ట్‌ను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. 'బొద్దింకను చంపితే హీరో అవుతారు.. సీతాకోక చిలుకను చంపితే విలన్‌ అవుతారు. నైతికతకు కూడా సౌందర్య ప్రమాణాలు ఉన్నాయి.' అంటూ సమంత రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఇలాంటి అభిప్రాయం ఇప్పుడెందుకు వచ్చిందని సమంతకు ట్యాగ్‌ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే విజయ్- సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement