
సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ నుంచి కోలుకున్న ఆమె ఇప్పుడు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటీడెల్ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. భారీ యాక్షన్ సీక్వెన్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం సమంత శిక్షణ తీసుకుంటుంది.
శరవేగంగా జరుగుతున్న ఈ సిరీస్ షూటింగ్‌లో యాక్షన్ సీన్స్ చేస్తూ సమంత గాయాలపాలైన సంగతి తెలిసిందే. దీంతో కాస్త బ్రేక్ ఇచ్చిన సామ్ త్వరలోనే విజయ్ దేవరకొండ సరసన ఖుషీ మూవీ సెట్స్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే చాలా రోజుల పాటు ఖుషీ షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో త్వరలోనే మార్చి 8నుంచి ఖుషీ సినిమా షూటింగ్ రీస్టార్ట్ కానుండగా సమంత కూడా షూటింగ్‌లో పాల్గొననుంది. సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి జూన్ కల్లా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment