ఫ్యాన్స్‌కు పోస్టర్‌తో ట్రీట్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌.. దేవర గ్లింప్స్‌ రెడీ | JR NTR Devara Movie Glimpse Released On January 8th | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌కు పోస్టర్‌తో ట్రీట్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌.. దేవర గ్లింప్స్‌ రెడీ

Published Mon, Jan 1 2024 1:48 PM | Last Updated on Mon, Jan 1 2024 2:11 PM

JR NTR Devara Movie Glimpse Released On January 8th - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ జూ ఎన్టీఆర్‌ దేవర కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. 2024 బాక్సాఫీస్‌ దేవర సొంతం కావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  జాన్వీ కపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ సమర్పిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

తాజాగా కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక శుభవార్తను కూడా ఎన్టీఆర్‌ షేర్‌ చేశారు. తన ఎక్స్‌ పేజీలో సరికొత్త లుక్‌లో ఉన్న తారక్‌ ఫోటోతో ట్రీట్‌ ఇచ్చారు. దేవర గ్లింప్స్‌ను జనవరి 8న విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌లో 2024 ఫుల్‌ జోష్‌ మొదలైంది. కొత్త ఏడాదిలో దేవర బరిలోకి దిగాడంటూ వారు కామెంట్లు చేస్తున్నారు. 

దేవర సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్‌ ఈ చిత్ర టీజర్‌పై చేసిన వ్యాఖ్యలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. పులికి అందరూ సలాం కొడతారు.. త్వరలో వచ్చే టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది అనేలా ఆయన చెప్పారు. మరోవైపు కల్యాణ్‌ రామ్‌ కూడా దేవర అంచనాలకు మించే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. దీంతో సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ అయింది. ఏదేమైనా 2024 బాక్సాఫీస్‌ దేవర సొంతం అని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement