
కొన్నిరోజుల క్రితం మంచు కుటుంబంలో ఎంత రచ్చ జరిగిందో మీ అందరికీ తెలిసిందే. అప్పటివరకు తండ్రితో కలిసి ఉన్న మనోజ్.. ప్రస్తుతం వేరుపడ్డాడు. మంచు మనోజ్ ప్రస్తుతం భార్యతో కలిసి మరోచోట ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తన కూతురి పుట్టినరోజు రాగా.. జైపూర్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు.
(ఇదీ చదవండి: వంటలక్క రెమ్యునరేషన్.. ఒకరోజుకి ఎంతో తెలుసా?)
మనోజ్.. భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు పాప పుట్టగా ఈ చిన్నారికి దేవసేన అని పేరు పెట్టారు. తాజాగా ఈమె పుట్టినరోజుని రాజస్థాన్ లోని జైపూర్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. మొన్న ఫొటోల్ని షేర్ చేసిన మనోజ్.. ఇప్పుడు వీడియోని పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలో భార్య, కొడుకు, కూతురితో కలిసి మనోజ్ చాలా ఆనందంగా కనిపించాడు. సాధారణంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటుంటారు. కానీ మనోజ్ తన కూతురి పుట్టినరోజుని డెస్టినేషన్ బర్త్ డేగా సెలబ్రేట్ చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనా వీడియో మాత్రం చూడముచ్చటగా ఉంది.
(ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)