దేవర నుంచి ఆయుధ పూజ రిలీజైంది. అసలు వస్తుందో రాదో అనుకుంటున్న సమయంలో సడెన్‌గా ఈ పాటను వదిలి సినిమా రిలీజ్‌కి కొన్ని గంటల ముందు సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. దేవర సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటినుంచి ఆయుధ పూజ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మేకర్స్ చెప్పుకుంటూ వచ్చారు. దీంతో ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ పాట కోసం ఎదురు చూశారు.
(చదవండి: ఆరేళ్ల గ్యాప్.. రికార్డుల మోత.. ‘దేవర’ గురించి ఈ విషయాలు తెలుసా?)
తాజాగా దేవర జ్యూక్ బాక్స్ రిలీజ్ చేసి..అందులో ఆయుధ పూజ సాంగ్‌ని కూడా యాడ్ చేశారు. ఎర్రటి సంద్రం ఎగిసి పడే.. అద్దిరి ఇద్దిరి అదిరిపడే హోరు.. రణధీరుల పండుగ నేడు అంటూ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగు ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. కాల భైరవ అద్భుతంగా ఆలపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇక దేవర విషయానికొస్తే.. జగతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment