Thalapathy67: అప్పుడు ‘మాస్టర్‌’.. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్‌! | Thalapathy 67: Vijay, Lokesh kanagaraj Latest Movie Updates | Sakshi
Sakshi News home page

Thalapathy67: అప్పుడు ‘మాస్టర్‌’.. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్‌!

Published Tue, Jan 31 2023 11:40 AM | Last Updated on Tue, Jan 31 2023 11:40 AM

Thalapathy 67: Vijay, Lokesh kanagaraj Latest Movie Updates - Sakshi

‘మాస్టర్‌’ తర్వాత కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కుతుందనే విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ని ఇచ్చింది నిర్మాణ సంస్థ 7స్క్రీన్‌ స్టూడియో. ‘మాస్టర్‌, వారిసు తర్వాత విజయ్‌తో కలిసి పనిచేస్తుండడం సంతోషంగా ఉంది. #Thalapathy37(వర్కింగ్‌  టైటిల్‌)కు లోకేశ్‌ కనగరాజ్‌దర్శకత్వం వహిస్తున్నారు.  జనవరి 2 నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్‌ రవిచందన్‌ , సినిమాటోగ్రఫీ మనోస్‌ పరమహంస అందిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’అని 7స్క్రీన్‌ స్టూడియో ఒక ప్రకటనలో తెలిపింది. 

గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్  గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్‌-విజయ్‌ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement