‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.
కాగా ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు బుధవారం యూనిట్ ప్రకటించింది. ‘‘ఈ చిత్రంలోని మోస్ట్ ఫెరోషియస్ పాత్ర కోసం నాని మేకోవర్ అవుతున్నారు. ‘జెర్సీ, గ్యాంగ్ లీడర్’ చిత్రాల తర్వాత నానీతో ముచ్చటగా మూడోసారి అనిరుథ్ సినిమా చేస్తున్నారు’’ అని చిత్రయూనిట్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment