
తమిళ హీరో ‘ఇళయ దళపతి’ విజయ్ నటిస్తున్నయాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మాస్టర్’. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆండ్రియా, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదే విధంగా ‘మాస్టర్’ చిత్రంలో విజయ్ సేతుపతి నెగటీవ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ప్రేమికుల రోజు పురస్కరించుకోని ఈ చిత్రంలోని ‘కుట్టి స్టోరీ’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటను హీరో విజయ్, చిత్రానికి సంగీతం అందించిన అనిరుద్ రవిచంద్రన్ కలిసి పాడటం విశేషం. అనురాజా కామరాజ్ సాహిత్యం అందించారు.
ప్రస్తుతం ‘కుట్టి స్టోరీ’ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొనసాగుతూ అత్యధిక వ్యూస్ సంపాదిస్తోంది. అంతర్జాతీయ మ్యూజిక్ చార్టులో చోటు దక్కించుకుని.. ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానాన్ని ఆక్రమించింది. విడుదల చేసిన రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న‘కుట్టి స్టోరీ’ పాట విజయంపై సర్వకర్త అనిరుద్ రవిచంద్రన్ తన ట్విటర్ ఖాతాలో స్పందించారు. ‘‘కుట్టి స్టోరీ’ పాటకు కోటి వ్యూస్ అందించిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ ఏడాది ప్రారంభంలో హిట్ ట్రాక్‌గా నిలిచిన ‘కుట్టిస్టోరీ’కి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’ అని అనిరుద్ ట్వీట్ చేశారు.
1 crore love for Thalapathy @actorvijay sir ‘s #KuttiStory 🔥🔥🔥 @Arunrajakamaraj thanks bro!
— Anirudh Ravichander (@anirudhofficial) February 15, 2020
Kodi nandrigal to all of you for making it the biggest track of the year 🙏🏻🙏🏻🙏🏻@Jagadishbliss @MalavikaM_ @SonyMusicSouth @XBFilmCreators @Lalit_SevenScr pic.twitter.com/Qnm65nXidy