నాన్నా.. రజనీకీ ఓ లవ్‌ స్టోరీ ఉంది | Rajinikanth Love Story with Latha Rajinikanth | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 12 2017 1:14 PM | Last Updated on Tue, Dec 12 2017 1:57 PM

Rajinikanth Love Story with Latha Rajinikanth - Sakshi

సాక్షి, చెన్నై : సౌత్‌ ఇండియా సూపర్ స్టార్‌ రజనీకాంత్‌.. తలైవాగా తంబీలతోపాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన పుట్టినరోజు నేడు. 67వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆయనకు సబంధించి కొత్తగా చెప్పుకోవాటానికి ఏముంటుంది చెప్పండి. ప్రతీ పుట్టినరోజుకి ఆయన వయస్సు తగ్గిపోతుందేమో అనిపిస్తోంది. ఇక లత రజనీకాంత్‌తో ఆయనది ప్రేమ వివాహమని.. అది ఎంత గమ్మత్తుగా జరిగిందో ఇప్పుడు చూద్దాం. 

తొలిచూపులోనే‌... 

అది 1980. తిల్లు మల్లు చిత్ర షూటింగ్‌లో సూపర్‌ స్టార్‌ పాల్గొంటున్నాడు. 70వ దశకంలో బాలీవుడ్‌లో వచ్చిన గోల్‌ మాల్‌ చిత్రానికి ఇది రీమేక్‌. పూర్తి హస్యభరితంగా ఆ చిత్రం ఉంటుంది. షూటింగ్‌ మధ్యలో ఓ కాలేజీ మ్యాగ్జైన్‌ ఇంటర్వ్యూ కోసం ఒకామె వచ్చారని ఆయన అసిస్టెంట్‌ చెప్పారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న రజనీ ఇంటర్వ్యూ కోసం పక్కకి వెళ్లారు. ఆయన్ని ఇంటర్వ్యూ చేయబోయేది ఎవరో కాదు.. లతా రంగాచారి. అప్పుడే ఆ మరుక్షణమే ఆమెకు చూడగానే రజనీ గుండెలో జుజుబి మొదలైంది. మాటల మధ్యలో ఆమెది బెంగళూర్‌ అని చెప్పటం.. రజనీ కూడా అక్కడ కండక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆ మాటలు మరింత ముందుకు వెళ్లాయి. ఈ క్రమంలో ఇద్దరి ఆసక్తులు ఒక్కటేనని తేలింది. దీంతో అప్పటికే ఓ స్టార్‌ అయిన రజనీతో లత చనువుగా మాట్లాడేందుకు వీలైంది. 

అప్పుడే రజనీ డిసైడ్‌ అయ్యాడంట...

ఆమెతో ఇంటర్వ్యూ కొనసాగుతున్న సమయంలోనే రజనీ మనసు.. మైండ్‌ రెండూ పని చేయకుండా పోయాయంట. ఆమెతో జీవితం పంచుకోవాలని డిసైడ్ అయిపోయి చివరకు ఆ క్షణంలో ఆమెకు ప్రపోజ్‌ చేశాడంట. దీంతో సూపర్‌ షాక్‌ తగిలిన ఆమె చిన్నగా నవ్వి తన తల్లిదండ్రులతో మాట్లాడమని రజనీకి చెప్పింది. అయితే రజనీ ఆ పని వెంటనే చేయలేదు. ఆమెతో స్నేహం కొసాగిస్తూనే అదను కోసం ఎదురు చూడసాగాడు. 

ఈ మధ్యలో ఈ విషయాన్ని తన స్నేహితుడు, నటుడు వైజీ మహేంద్రన్‌కు చెప్పాడంట. ఆయన లత సోదరి సుధ భర్త కావటం విశేషం. ఆ సమయంలో ఆమె పేరెంట్స్‌ ఒప్పుకుంటారో లేదోనన్న భయంతో రజనీ కొందరు సీనియర్‌ నటులను కూడా రంగంలోకి దింపాడంట. చివరకు రజనీకి ఊరటనిస్తూ లతా పేరెంట్స్‌ వారి వివాహానికి ఓకే చెప్పారు. కానీ, ఈ విషయాన్ని రజనీకి చెప్పకుండా వాళ్లు కొంత కాలం ఏడ్పించారంట. చివరకు ఏడాది తిరగక ముందే ఫిబ్రవరి 26, 1981 తిరుపతి వెంకన్న సమక్షంలో మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ఇద్దరూ ఒక్కటయ్యారు. వీరికి ఐశ్వర్య, సౌందర్య అనే పిల్లలు ఉన్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement