రజనీ నటనకు స్వస్తి? | Latha Rajinikanth confirms 'Kochadiiyaan' release may 9th | Sakshi
Sakshi News home page

రజనీ నటనకు స్వస్తి?

Published Tue, Apr 29 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

రజనీ నటనకు స్వస్తి?

రజనీ నటనకు స్వస్తి?

 రజనీకాంత్ నటనకు స్వస్తి చెప్పనున్నారా? కొంత కాలంగా చిత్ర పరిశ్రమలో సాగుతున్న సమాధానం లేని, ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రచారం. అలాగే ఆయన నటించిన తాజా చిత్రం కోచ్చడయాన్ విడుదలకు ఆర్థిక పరమైన వ్యాపార చిక్కులు అంటూ వదంతులు వెల్లువెత్తుతున్నాయి. వీటికి రజనీకాంత్ అర్ధాంగి లతా రజనీకాంత్ తనదైన శైలిలో స్పష్టత నిచ్చారు. అదేమిటో ఆమె మాట ల్లోనే చూద్దాం. ‘‘కోచ్చడయాన్ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇలాంటి పరిస్థితిలో చిత్రానికి ఆర్థిక సమస్యలు నెలకొన్నాయి. దీంతో చిత్రం విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందంటూ వదంతులు ప్రచారం అవుతున్నాయి. అలాంటి ప్రచారంలో వాస్తవం లేదు. అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. కోచ్చడయాన్ చిత్రాన్ని ఆరు భాషల్లో విడుదల చేస్తున్నాం.
 
 ఇలా చేయడం మాకేమంత కష్టం గా లేదు. మరో విషయం ఏమిటంటే కోచ్చడయాన్ చిత్రం ద్వారా ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. భారతీయ సినీ చరిత్రలో కోచ్చడయాన్ వంటి చిత్రాన్ని ఇంతకు ముందు చూసి ఉండరు. హాలీవుడ్ చిత్రం అవతార్ అత్యంత భారీ బడ్టెట్‌తో నిర్మించారు. అంత ఖర్చు మనం భరించలేం. అయితే ఆ చిత్రానికి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కోచ్చడయాన్ కోసం వాడే ప్రయత్నం చేశాం. సమయం, ఖర్చు, రజనీ కాంత్‌కు ఎలా చూపించాలన్న విషయాలు పెద్ద సవాల్‌గా నిలిచాయి. నిజం చెప్పాలంటే దర్శకురాలిగా సౌందర్య కు ఇది మోయలేని భారం. తన తం డ్రి రజనీపై నమ్మకంతో, నిరంతర కృషి, పట్టుదలతో చిత్రం చేశారు. భారతీయ సినీ చరిత్ర లో కోచ్చడయాన్ ఒక మైలురాయిగా నిలి చిపోతుంది. హాలీవుడ్ చిత్రాల్లో ఇంతకు ముందు ఆ తరువాత అన్నట్లుగా అవతార్ చిత్రం నిలిచిపోయింది. ఇదే తరహాలో  కోచ్చడయాన్ చిత్రం చరిత్రకెక్కుతుందని అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
 
 అది రజనీ ఇష్టం
 రజనీకాంత్ నటనకు స్వస్తి చెప్పనున్నారనే అంశం ప్రచారంలో ఉంది. అయితే రజనీ నటనకు స్వస్తి చెప్పి కుటుంబంలో గడపాలన్న నిర్ణయాన్ని ఆయన ఇష్టానికే వదిలేశాం. ఎప్పుడు? ఏమి చేయాలన్నది రజనీకి తెలుసు. ఆయ న ఆధ్యాత్మిక చింతన కలవారు. ఆయన మనస్సాక్షి ఏమి చెబితే అదే చేస్తారు.’’ అని లతా రజనీకాంత్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement