
కోలీవుడ్‌లో రజనీకాంత్ దశాబ్దాలుగా సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఈ బిరుదు ఆయనకు మాత్రమే సొంతం. 1975లో దర్శకుడు కె.బాలచందర్ చిత్రం అపూర్వ రాగంగళ్ ద్వారా రజనీ కాంత్ నటుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంతో శివాజీ రావ్ గైక్వాడ్ రజనీకాంత్‌గా మారారు. ఆరంభంలో ప్రతినాయకుడి పాత్రలు పోషించిన రజనీకాంత్ ఆ తరువాత కథానాయకుడిగా మారి భారతీయ సినీ చరిత్ర పుటల్లో తన కంటూ ప్రత్యేక పేజీని రచించుకున్నారు.
చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇప్పటికీ రజనీకాంత్ చిత్రం వస్తుందంటే అభిమానుల్లో ఆనందహేళ మొదలవుతుంది. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిషు ఇలా పలు భాషల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న రజనీకాంత్ నటుడుగా 47 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మధురక్షణాలను రజనీకాంత్ కుటుంబ సభ్యులు మంగళవారం ఇంటిలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.
చదవండి: స్పెయిన్‌లో జెండా ఎగురవేసిన నయనతార
ఆయన సతీమణి లతా రజనీకాంత్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఆ ఫొటోలను రజనీకాంత్ కూతురు సౌందర్య సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అందులో ఆమె పేర్కొంటూ “నాన్నా.. మాటల్లో వర్ణించలేని భావం మీరు. మీకు వీరాభిమానిని నేను. మీరు మా కుటుంబ సూపర్‌స్టార్’అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్‌లో నటిస్తున్నారు. ఇది ఆయనకు 169వ చిత్రం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment