ముంబైలో వేట్టయాన్‌ | Rajinikanth Vettaiyan final shooting schedule to commence in Mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో వేట్టయాన్‌

Published Sat, May 4 2024 12:17 AM | Last Updated on Sat, May 4 2024 12:43 AM

Rajinikanth Vettaiyan final shooting schedule to commence in Mumbai

ముంబైలో అమితాబ్‌ బచ్చన్‌ను కలిశారు వేట్టయాన్‌. రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్‌’ (వేటగాడు). అమితాబ్‌ బచ్చన్, ఫాహద్‌ ఫాజిల్, రానా ఇతర లీడ్‌ రోల్స్‌లో దుషారా విజయన్, మంజు వారియర్, రితికా సింగ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. తాజాగా ‘వేట్టయాన్‌’ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది.

రజనీకాంత్, అమితాబ్‌ బచ్చన్‌ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన ‘వేట్టయాన్‌’ షూటింగ్‌ షెడ్యూల్‌లో రజనీ, అమితాబ్‌ కాంబినేషన్‌ సీన్స్‌ తీశారు. ఇప్పుడు ముంబైలో వీరిద్దరి కాంబినేషన్‌ సీన్స్‌ను తీస్తున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్స్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement