
చెన్నై: తమిళ సినీ హీరో విశాల్ త్వరలోనే పోలీటికల్ ఎంట్రి ఇవ్వబోతున్నాడు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పోటీ చేసి గెలుపోందిన విషయం తెలిసిందే. ప్రైవేటు రంగంలో రెండు కీలక పదవులు చేపట్టి సత్తా చాటుకున్న విశాల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తాజాగా ప్రకటించాడు. త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఏదైన ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయ ప్రవేశం చేయాలని విశాల్ నిర్ణయించుకున్నాడు. అంతేగాక తన పోలీటికల ఎంట్రీ కోసం అభిమాన సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నాడంట. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడనేది విషయంపై స్పష్టత లేదు. ఈ విషయాన్ని విశాల్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాడంట. (చదవండి: బీజేపీలోకి హీరో విశాల్?)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతితో గతంలో ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో విశాల్ పోటీ చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ ఎలక్షన్‌లో నామినేషన్ కూడా వేశాడు. అయితే నామినేషన్‌ను ప్రతిపాదించిన 10 మందిలో కొంత మంది తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో ఎన్నికల కమిషన్ విశాల్ నామినేషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆ ఉపఎన్నికల్లో విశాల్ పోటీ చేయలేకపోయాడు. ఇక త్వరలో రాబోయే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు విశాల్ సిద్ధమవుతున్నాడు. దీంతో టీఎఫ్‌పీసీ అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా విశాల్ రాజీనామ చేయాలని తమిళ పరిశ్రమకు చెందిన దర్శక, నిర్మాతల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: విశాల్‌కు షాక్: నష్టాన్ని అతడే భరించాలి)
దర్శకుడు, నటుడు చెరన్ మాట్లాడుతూ.. ‘గత ఆదివారం జరిగిన నిర్మాతల కౌన్సిల్ సమావేశంలో విశాల్ తమ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే నడిగర్ సంఘం, నిర్మాతల కౌన్సిల్ కానీ రాజకీయ పార్టీలు కాదని ఆయన పేర్కొన్నారు. అంతేగాక టీఎఫ్‌పీసీ ఉప చట్టాల ప్రకారం తమ సభ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించలేరని, ఒకవేళ విశాల్ అలా చేయాలనుకుంటే నిర్మాతల కౌన్సిల్‌కు, అసోసియేషన్‌లకు రాజీనామా చేసిన తర్వాతే అతడు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్మాత, దర్శకుడు రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: కారు ధ్వంసం.. ఆమె పైనే అనుమానం?)
Comments
Please login to add a commentAdd a comment