హీరో విశాల్‌కు ఊరట | Hero vishal gets relief | Sakshi
Sakshi News home page

హీరో విశాల్‌కు ఊరట

Published Fri, Feb 3 2017 11:37 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM

హీరో విశాల్‌కు ఊరట - Sakshi

హీరో విశాల్‌కు ఊరట

చెన్నై: ప్రముఖ హీరో విశాల్‌కు ఊరట లభించింది. ఆయనపై తమిళ నిర్మాతల మండలి విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మద్రాస్‌ హైకోర్టు జోక్యంతో తమిళన నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది.  తమిళ నిర్మాతల మండలి తీరును విమర్శిస్తూ విశాల్‌ పత్రికల్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా నిర్మాతల మండలి కార్యవర్గం లేఖ రాసింది. దీంతో విశాల్‌  వివరణ ఇచ్చాడు. ఈ వివరణతో సంతృప్తి చెందని నిర్మాతల మండలి అతడిపై తాత్కాలికంగా వేటు వేస్తూ తీర్మానం చేసింది.

దీంతో విశాల్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. తాను 2013 నుంచి చిత్ర నిర్మాణంలో ఉన్నానని, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, దురుద్దేశంతో నిర్మాతల మండలి నిర్వాహకులు చట్ట వ్యతిరేకంగా తాత్కాలిక నిషేధం విధించారని పిటిషన్‌లో పేర్కొన్నాడు. తనపై విధించిన నిషేధాన్ని తొలగించేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరాడు. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు ఉత్తర్వుల మేరకు విశాల్‌పై సస్పెన్షన్‌ను నిర్మాతల మండలి ఎత్తివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement